ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Thursday, September 11, 2008

ఆంధ్రలో అయిదువేల కోట్ల రూపాయల భూ కుంభకోణం

స్థలాల ఎరతో రాజ్యాంగ వ్యవస్థలను లోబరుచుకునేందుకు పాలకుల పన్నాగాలు

ప్రజలు, చట్టసభలు, అధికార యంత్రాంగం, మీడియా .... ఇలా ఏ ఒక్కో వర్గాన్నీ లెక్కచేయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టు పై విరుచుకుపడి న్యాయమూర్తిపైనే సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలిసిందే.అదే కాకుండా రాష్ట్ర రాజధాని నగరంలో భారీ భూ కుంభకోణం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వ పాలకులు వారి స్వీయ ప్రయోజనాలను ఆశించి నచ్చిన వారికి కోట్ల రూపాయల భూములను కేటాయిస్తుంది.తరువాత తమ మనుషులకు చెందేలా పావులు కదుపుతోంది.

ఈ కోవలో తాజాగా మరో అంకానికి తెరతీశారు.తమ అస్తవ్యస్త విధానాలను ప్రశ్నించకుండా ఎమ్మెల్యేలకు, చెప్పిన పని చెప్పిన విధంగా చేసేందుకు గాను అధికార యంత్రాంగానికీ,వీటిని బయటపెట్టకుండా మీడియాకు, హైకోర్టులో వున్న కేసుల విషయంలో ప్రభావం చూపేందుకు న్యాయమూర్తులకు ప్రభుత్వం స్థలాలను ఎరగా వేసింది.ఓ పక్క రాజధానిలో లక్షలాది మంది రోడ్లపైనా , ఫుట్ ఫుటపాత్ లపైనా బతుకుతుంటే ... మరోపక్క నెలకు ఆయిదంకెల జీతాలను పొందుతున్న వారికి కోట్ల రూపాయల విలువైన స్థలాలను నామమాత్ర ధరలకు కట్టబెడుతుంది. జ్యుడిషియరి, లెజిస్లేచర్ ,ఎగ్జిక్యూటివ్,మీడియా ..ఈ నాలుగు ఎస్టేట్ల వారికీ వందల కోట్ల రూపాయల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం మార్చి 17వ తేదిన కేబినేట్ సమావేశంలో తీర్మానించింది. అన్ని పత్రికలూ కేబినేట్ సమావేశం వార్తను ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయాన్ని రాయలేదు. ఒక్క టెలివిజన్ ఛానల్ కూడా ఆ విషయాన్ని ప్రసారం చెయ్యలేదు.దీన్ని బట్టి ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.

పాత్రికేయులకు కేటాయించిన 70ఎకరాల భూమి విలువ సుమారు వెయ్యికోట్లు.ఇందులో 300 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తున్నారు.ఈ ఒక్కో ప్లాటు విలువ కనీసం 70 లక్షలు.అలానే ఒక్కో జడ్జీకి కేటాయిస్తున్న ప్లాటు విలువ రెండు కోట్లు.ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు,అయ్యేఎస్ ,ఐపీఎస్ అధికారులకు ఇస్తున్న ప్లాట్ల విలువ కొటి రూపాయల పైమాటే.దీంట్లో తనకు నచ్చిన వారికి ప్లాట్లు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అయ్యేఎస్,ఐపీఎస్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది.కేంద్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా లెక్క చేయక పాత తేదీలతో జీవో జారీ చేసారు.

ఇలానే 2005లోను కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనం పేరుతో రాజ్యంగా వ్యవస్థలకు ఎరగా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అప్పటి హైకోర్టు జస్టీస్ శ్రీ సింఘ్వి అడ్డుకున్నారు.ఆయన సుప్రీం కోర్టుకు బదిలీ అయ్యే వరకూ ఆగిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత ఆ ప్రక్రియను వేగవంతం చేసింది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ సింఘ్వి(08.10.2007) ఇచ్చిన తీర్పు ప్రకారం వ్యక్తిగతమైనా సరే ఇప్పటికే ఎవరికయినా వారి లేదా భార్య పిల్లల్లో ఎవరి పేరునైన ఇల్లు/స్థలం వుంటే వారికి ప్రభుత్వ స్థలం ఇవ్వవద్దని చెప్పారు .ఇప్పుడు సొసైటీ సభ్యత్వాలున్న వారిలో కొందరికి వారి సొంత/భార్య/పిల్లల పేర్లపై స్థలాలు,ఇల్లు వున్నాయి.ఇలాంటి వారికి కూడా కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వనున్నారు.అంతేకాకుండా ఆ తీర్పు ప్రకారం అవుటర్ రింగురోడ్డు పరిధిలో ఏ సొసైటీకికానీ,వ్యక్తులకు కనీ స్థలాలు కేటాయించవద్దని స్పష్టంగా ఆదేశించింది.భవిష్యత్ సమాజ అవసరాలు,సంక్షేమం దృష్ట్యా చీఫ్ జస్టిస్ చెప్పిన ఆ విషయాన్ని తుంగలో తొక్కారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు,అక్రమాలపై మా రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నిటిలోనూ ప్రతి రోజూ బ్యానర్ కధనాలు వచ్చేవి .పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో విచారణలో వున్నాయి.వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు జరుగుతాయి.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలు మూడింటినీ తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అందులో భాగమే కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ఖరీదైన స్థలాల పందేరం.పనిలో పనిగా స్థలాలు అప్పగించిన సోసైటీల్లో తన వారిని ప్రవేసపెట్టి బినామీ పేర్లతో ముఖ్యమంత్రి,ఆయన సన్నిహిత సహచరులు స్థలాలను తీసుకుంటున్నారు.హైకోర్టు జడ్జీలు కూడా లబ్దిదారులుగా వున్న ఈ స్థలాల వ్యవహారాన్ని అదే జడ్జీలు విచారించబోతున్నారు.పాత్రికేయుల సొసైటీ (జవవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యుచివల్లీ ఎఇడేడ్ కో ఆపరేటివే సొసైటీ లిమిటెడ్ )లో 1050 మంది సభ్యులలో 125 మంది బినామీలే! దీనిపై హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం,మరికొన్ని ఇతర కేసులను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారు.ముఖ్యమంత్రి ఇటీవలే ఒక దిన పత్రికను ప్రారంభించారు.ఇప్పుడు లబ్ది పొందుతున్న వారిలో ఆయన పత్రికలో పనిచేస్తున్న అనర్హులయిన జర్నలిస్టులు పదుల మంది వున్నారు.ఇలా స్థలాలు ఇప్పిస్తామన్న హామీతోనే వారిని ఇతర సంస్థల నుంచి తన పత్రికకు వచ్చేలా ముఖ్యమంత్రి ఆకర్షించారు.


ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ స్థంభించిపోవటం ఖాయం.ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్, హైకోర్ట్ వివధ సందర్బాలలో తూర్పరపట్టాయి.వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఎత్తి చూపాయి.వాటిపై చర్యలు తీసుకోమన్న ఒత్తిడి రాకుండా ఇప్పుడీ స్థల పందేరాన్ని సాగిస్తుంది.మీరు తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

ఇట్లు,
--- సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న జర్నలిస్టులు
manakosamtelugudesam@gmail.com

Tuesday, September 2, 2008

గనులలోను మీరు గనులే - ఇక ఏమి మిగిలించినారు బావి తరాలకి?

వందల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను అస్మదీయులకు దోచిపెడుతున్నారు.
1) ఓబులాపురం లోని ఇనుప ఖనిజం గనులు , ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితుడని పేరున్న వ్యక్తికి .
> కోట్ల విలువైన 64.20 ఎకరాలు అప్పగించినారు.


> అదే వ్యక్తికి సంబందించిన బ్రహ్మని స్టీల్ ఫ్యాక్టరీ 10,670 ఎకరాలు. (ఎకరా, 18,500/- కే)
> మార్కెట్ రేట్ తో పోలిస్తే , ప్రభుత్వానికి 110 కోట్ల నష్టం.

2) విశాక ఏజెన్సీలో , అరకు సమీపంలో సొంత పార్టీ M.P కి చెందినా జిందాల్ సంస్తకు బాక్సైట్ గనులు

> కేటాయించినది 1700 ఎకరాలు . (రైతుల భూములు కూడా లాకున్నారు).

3) రాస్-అల్-ఖైమ సంస్థకు , విశాక ఏజెన్సీలో జీరల వద్ద వున్నా బాక్సైట్ గనులు అప్పగించినారు (బందువులకు బాగస్వామ్యం ) .

4) శ్రీకాకుళం, విశాక మద్య ఆపారమైన విలువైన సుక్ష్మ కనిజాలు వున్నా సముద్ర ఇసుక నిక్షేపాలు , గనుల రంగంలో ప్రముకుడైన వ్యక్తికి అప్పనంగా ఇచ్చేసినారు.

5) ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితుడిగా పెర్రున్న జింపక్స్ సంస్థకు , చిమాకుర్తిలో వందల కోట్ల విలువైన బ్లాక్ గెలాక్స్ గ్రానైట్ గనులు
> 10000 కోట్ల కాంట్రాక్టు, 1000 కోట్లకే. ( ప్రభుత్వానికి నష్టం 9000 కోట్లు . )

6) తనయుడికి 2000 ఎకరాల సున్నపు రాయి గనులు.

7) మంత్రి వద్ద డ్రైవర్, వంటమనిషి, మరియు సహచరుల సంస్థ అయిన త్రిసుల్ సిమెంట్ సంస్థకు 1625 ఎకరాల సున్నపు రాయి గనులు.
> డ్రైవర్, వంటమనిషి,, అనుచరుల పేరుపై 570 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ.

ఇదేమిటి అని అడిగితె , డ్రైవర్ , వంటమనుషులు అబివృద్ది చెందకుడదా , పారిశ్రామిక వ్యక్తులు అవకుడదా, అని మంత్రిగారి ఎదురు ప్రశ్న.
ఆ మంత్రిగారి అబివృద్ది సూత్రం ఎమిటో అందరికి చెప్తే, ఇక దేశంలో పేదరికం వుండదు కదా .

ఇట్లు ,యువ ఇంజనీర్స్
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com
Visit : http://manakosam-telugudesam.blogspot.com

Friday, August 29, 2008

మీ అవినీతి అనంతం - అది మీకే సొంతం మరియు సాద్యం


భూ కబ్జాలు - ఇదేనా రైతు పాలన ??

>> ఇడుపులపాయలో అదికార దుర్వినియోగం - అప్పటివరకు అనుబవించిన 618 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు పంచుతాము అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో అబివృద్ది చేసుకున్నారు.

>> 20 కోట్ల ఫై విలువ చేసే , 2.14 ఎకరాల మునిసిపాలిటి భూమి మంత్రిచే కబ్జా.

>> నిరుపేదలకు కేటాయించిన కోట్ల విలువైన 41.35 ఎకరాల భూమి M.L.A చే ఆక్రమణ .

>> మంత్రులు, M.L.A చే భూకబ్జాలు .

>> హైదరాబాద్ సివార్లోని నాదర్గుల్ లో , 1000 కోట్ల విలువైన 967 ఎకరాల భూకబ్జా. M.L.A మరియు ప్రభుత్వ సలహాదారుల హస్తం .

>> ఓడరేవుల నిర్మాణం పేరుతో 20000 వేల ఎకరాల భూమి సంతార్పణ.


>> నల్గొండ జిల్లాలో 10000 ఎకరాలు స్వాహా. రికార్డు లోనే 4000 ఎకరాలు , వస్తవములు 10 వేల ఎకరాలు.


మీ అవినీతి అనంతం - రోజుకొక పధకంతో , ప్రజలని మబ్యపెడుతూ మీరు చేస్తున్న అవినీతికి ఇది నిదర్శనం


1) సమాల్ నివేదిక (ఒక రిటైర్ విజేలేన్స్ అధికారి మీ ప్రభుత్వంపై ఇచ్చిన నివేదిక లో మచ్చు తునకలు )

>> అవినీతి నిలయంగా , ముఖ్యమంత్రి కార్యాలయం.
>> అవినీతి అధికారులకు వత్తాసుగా హోమంత్రి.
>> వివిధ ప్రభుత్వ సేకలలో అవినీతి కుపాలుగా మారినాయి.
>> జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం.
>> నాణ్యత నియంత్రణ వ్యవస్త కుప్పకూలినది.
>> విచ్చలవిడిగా ఖనిజ సంపద దోపిడీ.


2) ప్రభుత్వ అవినీతిపై కాగ్ నేవేదిక (ఒక రాజ్యాంగ బద్దమైన సంస్ఠ ప్రస్తుత ప్రభుత్వ అవినీతి ఫై ఇచ్చిన నివేదిక )

>> ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 359 కోట్లు అప్పనంగా కాంట్రాక్టర్స్ కి దారాదత్తం చేసినది.

>> అవినీతికి సచివాలయం అడ్డా.
> 2600 విజిలేన్స్ కేసులపై చర్యలు లేవు.
> 230 అవినీతి పరులకు గొడుగు.

>> బడికి వెళ్ళని పిల్లలు 4.23 లక్షలు (డిసెంబర్ -2007)

>> బళ్ళు లేని ఆవాస ప్రాంతాలు - 1925

>> ప్రాదమిక, ప్రదమికోన్నత పాఠశాలలో , 54,730 ఉపాద్యయాల ఖాలీలు.

>> గేట్స్ తగ్గించి. పులిచింతల కాంట్రాక్టర్కి 47.37 కోట్లు దోచిపెట్టినారు.

>> నిధులు కొండంత, ఖర్చు గోరంత.

> 9299 కోట్లు మిగిలించుకున్న సర్కారు. (2005-2006 ఆర్దిక సంవత్సరం)

>> శ్రీ పాద సాగర్ ప్రాజెక్ట్ లో , 14.01 కోట్లు కాంట్రాక్టర్కి దోచిపెట్టినారు.

3) ఇందిరమ్మ ఇల్లు - ఇది మీ అవినీతి కి పెంకుటిల్లు లాంటిది

>> వందల కోట్ల ధనం పెద్దల పాలు అవుతుంది.

>> పేదలకు అందవలసిన ఇల్లు , సొంత పార్టీ నాయుకులకు , బందువులకు సొంతం అవుతున్నాయి.

>> ఇల్ల పేరుతో దుకాణాలు, షాపులు, అంతస్తులు, దేవస్థానాలు, నిర్మించుకుంటున్నారు.

>> ముఖ్యమంత్రి, మంత్రులు, M.L.A , సినిమా యాక్టర్స్ పెర్లపై ఇల్ల నిర్మాణం జరుగుతున్నది అంటే, వూహించుకోవచ్చు.

>> మీ పిచ్చి పాలనకు నిదర్శనాలు
> మూడు రంగులు లేకపోతె వెయ్యి కోత .
> ఇల్లపై ఇందిరమ్మ పలకలకోసం 4 కోట్ల కేటాయింపు.


>> ఇల్లు కట్టిస్తారు అని, వున్నా గుడిసె పీకున్న పేదలకు , ఇల్లు పోయే, గుడిసె పోయిన పరిస్తితి.

పదకాల పేరుతో పంచుకుతింటున్నారు. బావి పౌరులకు ఏమి అందించదలుచుకున్నారు ఈ పాలకులు ??

ప్రతి ఒక్కరు బావి పౌరుల బంగారు బవిష్యత్తు కొరకు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది .

రండి .....తరలి రండి ....విజన్ వున్నా నాయుకున్ని బలపరుద్దాం.

ఇట్లు ,
యువ ఇంజనీర్స్.
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com

తాకట్టు లో ఉన్నతెలుగు ఆత్మగౌరవం

తాకట్టు లో ఉన్నతెలుగు ఆత్మగౌరవం , స్వరాజ్యం వచ్చినా రాని 'సు'రాజ్యం, మద్రాసి అనే మాయని మచ్చ,జవసత్త్వాలు ఉడిగిన జాతి , పొరలు గ పేరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ , జవాబుదారి తనం లేని జమానా , కనీస వసతులు లేని కోట్లాది జనాభా పాతికేళ్ళ కిందట ' తెలుగుదేశం' ఆవిర్భావానికి కారణాలు అయ్యాయి.

జనం గుండె గుడి లో కొలువున్న దేవుడు , తెలుగు వారి రాముడు ,కృష్ణుడు ఐన నందమూరితారక రాముడు సామాజిక అసమానతలని రూపు మాపి , తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశ్యం తో 'తెలుగుదేశం ' పార్టీ ని స్థాపించారు.

తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పారదర్శకత , నిజాయతి , సామాజిక బాధ్యత తో కూడిన నూతన రాజకీయాలని తెలుగు వారి ముందు ఆవిష్కరించింది .సుమారు రెండు వందల విద్యావంతులకి శాసన సభ లో ప్రవేశం కల్పించింది.

'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు' అనే ధర్మ వాక్యం పాటించి పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కి ఊపిరి పోసారు ఎన్టీ రామారావు గారు.మహిళ ల కి ఆస్థి లో సమాన హక్కు ,విద్య ఉద్యోగాల్లో ౩౩% అవకాశాలు , కుట్టు వంటి వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ , జీవన భద్రత , మహిళా విశ్వ విద్యాలయ స్థాపన , మండల పాలనా వ్యవస్థ , మెరుగైన రవాణా సౌకర్యాలు , రక్షిత మంచి నీటి పధకాలు, సింగిల్విండో పధకం ద్వారా రైతులకి రుణాలు,ప్రకృతి వైపరీత్యాల సమయం లో రుణ మాఫీలు ,ఉచితం గ పక్కా ఇళ్ళ నిర్మాణం , రెండు రూపాయలకే కిలో బియ్యం , రైతన్న లకి ఉచిత విద్యుత్ .మద్యపాన నిషేధం , జోగినీ దురాచార నిర్మూలన, గరిష్ట భూపరిమితి చట్టం , పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , వెట్టి చాకిరీ నిషేధం ,అవినీతి లేని అధికార వ్యవస్థ ,స్వయంప్రతిపత్తి గల స్థానిక వ్యవస్థ , రాయలసీమ కి తెలుగు గంగ ద్వారా జలాలు ,సాగు తాగు నీటి వసతుల కల్పన, సత్వర న్యాయం కోసం లోకాయుక్త ఏర్పాటు ,ఉన్నత విద్యా ప్రవేశపరీక్షలు ,విద్యారంగం లో ఫీజు రద్దు, వైద్య , తెలుగు విశ్వ విద్యాలయాల ఏర్పాటు , నేత వృత్తుల వారికీ ఆప్కోద్వారా భద్రత , సంస్కృతీ పరిరక్షణ కోసం టాంక్ బండ్ పై తెలుగు వెలుగుల విగ్రహాల ఏర్పాటు, నక్సలిజం నిర్మూలన,మత కల్లోలాల అణిచివేత , శాంతి భద్రతల రక్షణ వంటి పలు కార్యక్రమాల ద్వారా ఇంటింటిధైవం గ నీరాజనాలు అందుకున్నారు .అన్న గా ఆడపడుచుల గుండెల్లో నిలిచిపోయారు నందమూరి .ఢిల్లీ పెద్దల కళ్లు బైర్లు కమ్మేలా తెలుగు ఆత్మ గౌరవపతాకాన్ని విను వీధుల్లో ఎగరవేశారు ఎన్టీయార్ .

అయన వారసుని గ అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు,అభివృద్ది ని క్రొత్త పుంతలు తొక్కించి దార్శనికత తో ఆర్థిక, విద్యుత్ సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశం లో నే అగ్రగామి గా గనిలబెట్టారు.

ఈ -సేవ, జన్మభూమి, ప్రజల వద్దకి పాలన, హై-టెక్ విధానాలు, పరిణతి చెందిన రాజకీయాలు, మహిళ ల కోసం డ్వాక్రా పధకాలు, సాంకేతిక విద్యా విప్లవం, పారిశ్రామిక అభివృద్ది , సాగు నీటి సంస్కరణలు, పాలన లో ప్రజా భాగస్వామ్యం , నోడల్ వ్యవస్థ , బలమైన స్థానిక పాలన వ్యవస్థ లాంటి ఎన్నో పధకాల ద్వారా దేశం అంతా మన రాష్ట్రాన్ని ఆదర్శం గ తీసుకునేలా చేసారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు .

కాని ప్రకృతి వైపరీత్యాల వల్ల , కాలం కలిసి రాక గత ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలయ్యింది .
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రాష్ట్రము రావణ కాష్టమే అయ్యింది.

నేడు జన్మభూమి పరిస్తితి ...

>> దిగజారిన జీవన ప్రమణాలు ,నీరు గారిన నీటి ప్రాజెక్టులు( ఒక్క వరద కే గండ్లు పడ్డ ప్రాజెక్టులు ఎన్నో .. ),

>> హద్దుల్లేని హత్యారాజకీయాలు(సుమారు రెండు వందల తెలుగు దేశం కార్యకర్తల హత్య),

>> కొల్లలు గా కుంభకోణాలు (వోల్క్స్ వాగన్ ,డిపెప్, బ్రహ్మిని స్టీల్స్ కి భూమి ,పద్మాలయ స్టూడియోస్ ఉచితం గ భూమి లాంటివి ఎన్నో..),

>> పత్రిక స్వేఛ్చ మీద ప్రత్యక్ష దాడులు (ఈనాడు, ఆంధ్రజ్యోతి ల మీద కేసులు),

>> చుక్కల్లో చిక్కి దిగి రాని ధరలు( గత ఆరు మాసాల జన జీవనం పీడకల) ,

>> రామరాజ్యం స్థానం లో 'బల భీమ ' రాజ్యము,

>> దేహి దేహి అంటు ఢిల్లీ వీధుల్లో దేబిరించే స్థితి(సోనియా చెప్పకుండా చీమ కూడా కుట్టదు),

>> కుల మత ప్రాంత విద్వేషాలు అన్ని కలిసి ఓటు వేసి చేసిన పొరపాటు ని వెక్కిరిస్తున్నాయి..

>> ఒక్కసారి మళ్లీ రాష్ట్రము ౩ దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది.కుంటుపడ్డ అభివృద్ది కుంటుతూ నడుస్తుంది.

భావి తరాలకి మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించాలి.ఇందుకు యువత నడుము కట్టాలి ,నిద్ర మత్తు వీడి నిప్పులు చెరగాలి.

రామరాజ్యం మళ్ళీ సాధించి మన రామన్న ఆత్మకి శాంతి చేకూరుద్దాము.

రండి ...తరలి రండి ...రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము .
ఇట్లు,
యువ ఇంజనీర్స్ ,
ఆర్టికల్ - శ్రీనివాస్
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com

Tuesday, August 26, 2008

పుత్రోత్సాహం విలువ ఎంత ?



వెలుగు(పదవి) వుండగానే ఇల్లు చక్క దిద్దుకోవటం అంటే ఇదేనా?

1) పత్రికా స్తాపనకు

9.9 % వాటాకు 79 % సొమ్ము.
>> పుత్రుడి వాట 61.29 % . పెట్టుబడి పెట్టినది 50 కోట్లు.
>> ఇతర అన్ని సంస్తల వాట 38.71 %, పెట్టుబడి పెట్టినది 305 కోట్లు.
*** ఏమి మేదస్సు ?? ఇది అందరి మెదడకు మేత లాంటిది .

2) రగురాం సిమెంట్ ఫ్యాక్టరీ


>> పెట్టుబడి పెట్టినది 45 కోట్లు . ఒక సంవత్సరం తరువాత దాని విలువ 6500 కోట్లు.
>> పాలనపరం అయిన అనుమతులు, 2000 ఎకరాల సున్నపు గనులు క్షణాలలో అయిపోయినాయి.
>> 7 కోట్లతో డబల్ లేన్ రోడ్ .
>> 3500 కోట్లతో నెల్లూరు జిల్లా సోమసీల ప్రాజెక్ట్ నుండి, రగురాం సిమెంట్ ఫ్యాక్టరీకి నీటి తరలింపు.

**** ఏమి ఈ తండ్రి ప్రేమ ?? ఇందులో కొంచెం అయిన రాష్ట్ర బవిష్యత్తు ఫై వుంటే, మాకు ఈ బాద తప్పేది కదా.

3). ఇడుపులపాయలో - (అప్పటివరకు అనుబవించిన 618 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు పంచుతాము అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో అబివృద్ది చేసుకున్నారు. )


>> 1300 కోట్లతో IIIT నిర్మాణం.
>> 100 కోట్లతో యోగి వేమన కాంపస్ .
>> 8 కోట్లతో ఎకో పార్క్.
>> 29 కోట్లతో ఇడుపులపాయ నుండి యోగి వేమన వర్సిటీకి 4 లేన్ రోడ్.
>> గోల్ఫ్ కోర్సు, ఇతర సుందరికరనలకు 10 కోట్లతో ప్రతిపాదనలు .
>> కడప - బెంగుళూరు వెళ్ళే రైల్వే మార్గాన్ని , ఇడుపులపాయ ద్వార వేల్లెవిదంగా మార్చుకోవటం విశేషం.

**** రాష్ట్రం లో వెనుకబడిన జిల్లాలు కాని , ప్రాంతాలు కాని కనిపించటం లేదా ? మీరు పచ్చగా వుండే సరికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందా ?

4) పులివెందలకి మహా బాగ్యం .
>> 4 సంవత్సరాలలో , 7,185 కోట్లతో ప్రతిపాదనలు .


పక్కనే వున్నా లేక్కిరెడ్డిపల్లె నియోజక వర్గం దుర్బర పరిస్థితిలో వుంది.

*** సొంత నియోజక వర్గాన్ని అబివృద్ది చేసుకోవటం తప్పు అని అనటం లేదు . మిమ్మల్ని నమ్ముకొని రాష్ట్రం అంతా వుంది , అది గుర్తుందా ?

** ఇదేనా దేవుడి పాలన ? అదేమిటో , దేవుడు మీ కుటుంబం అందు వుంచిన అంత దయ , ఈ ప్రజానీకంఫై వుంచటం లేదు .
** ఏమి మేదస్సు??? , 45 కోట్ల పెట్టుబడి, ఒక సంవత్సరం లో దాని విలువ 6500 కోట్లు . మీ పుత్రుడి చే ISB(ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ ) లో క్లాసులు నిర్వహిస్తే, ఈ దేశానికి ఎంత మంది ఆర్దిక వేత్తలని తయారు చేయవచ్చో .

** మీ పుత్రుడిని వ్యాపారులు చేయకూడదు అని అనటం లేదు. అది అందరి హక్కు . ఇంత త్వరగా ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదిన్చినారో చెప్తే, మేము కూడా నేర్చుకుంటాము . దయచేసి మా తండ్రులని ముఖ్యమంత్రి అవమని మాత్రం చెప్పకండి .


ఏమిటి యువత తక్షణ కర్తవ్యము ?

రోజుకొక పధకం పెడుతూ , ప్రజలని మభ్య పెడుతూ , ఈ ప్రభుత్వం చేస్తున్న స్వార్ద పాలనను ప్రజల ముందు వుంచవలసిన తరుణం ఇది. బావి పౌరుల బంగారు బవిష్యత్తు కొరకు యువత ఆలోచించవలసిన తరుణం ఇది.

ఇట్లు,

యువ ఇంజనీర్స్
manakosamtelugudesam@gmail.com



Monday, August 11, 2008

సమాజ సేవలో తెలుగుదేశం - ఎన్.టి.ర్ ట్రస్ట్

రాజకీయ పార్టీ కార్యకర్తలను, సమాజ సేవ వైపు నడిపించిన ఎకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.

అత్యదిక రక్త దాతలు చే రక్తం అందుకున్న బ్లడ్ బ్యాంకు గా, ప్రభుత్వం చే గుర్తింపు పొంది, అవార్డు పొందిన ఒకే ఒక్క ట్రస్టు - ఎన్.టి.ర్ ట్రస్ట్.
దీని నుండి ఇతరులు నేర్చుకోవలిసినది : ఆర్బాటం కన్నా ఆచరణలో చేసి చూపటం.

* ప్రతి మనిషి కి ఆరోగ్యకరమైన జీవితం, విద్య , ఆర్దిక స్వాతంత్యం అందిచాలి అనే సంకల్పం తో ఏర్పడి, ఎంతో మందికి అండగా నిలబడినదే - ఎన్.టి.ర్ .ట్రస్ట్

* ప్రకృతి విలయ తాండం చేసిన ప్రతిసారి, రాజకీయాలకు అతీతంగా , మీకు మేము వున్నమంటూ ముందుకు వచ్చేది - ఎన్.టి.ర్ ట్రస్ట్

* ఒక మనిషి ఆరోగ్యంగా వున్నప్పుడే , తన హక్కులని కాపడుకోగలడు అని సూక్తితో , ఎన్.టి.ర్ ట్రస్ట్ పలు విదములైన వైధ్య శిబిరములు నడుపుతుంది.

1. గ్రామీణ మరియు పేద ప్రజల అవసరాలు వైధ్య అవసరాలు తీర్చుటకు , అందుబాటులో ఉంచుటకు , కదిలే వైధ్య శిబిరములు (మొబైల్ క్లినిక్స్) ఏర్పాటు చేసినది.

>> ప్రతి మొబైల్ క్లినిక్ , నెలకి 48 గ్రామాలని చుట్టి వస్తుంది.

>> ఆరోగ్య పరిక్ష (హెల్త్ చేకప్ ) లతో పాటు, ప్రాదమికంగా అవసరమైన మందులను ఉచితంగా ఇస్తుంది .
>> హాస్పిటల్స్ లో చికత్స అవసరమైన అప్పుడు, కొన్ని ప్రత్యేక హాస్పిటల్స్ లలో రాయితీ ఇప్పిస్తుంది.
>> గ్రామీణ ప్రజలకు , ఆరోగ్యం ఫై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది.
>> ప్రకృతి వైపరిత్యాలు సంబవించినప్పుడు , అంటు వ్యాదులు సోకకుండా ముందు వుండి తన సేవలు అందిస్తుంది.

>> అత్యవసర సమయాలలో రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, రక్త దాన శిబిరములు నడుపుతున్నది.

2. మారుమూల గ్రామాలలో నేత్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.

>> గ్రామీణ విద్యార్ధులు చూపు లోపంవల్ల , చదువుకు దూరం అవుతున్నారు అని గ్రహించి, అవసరం అయిన మందులు, కంటి అద్దాలు (గ్లాసెస్) ఉచితంగా అందిస్తున్నది.
>> గ్రామాలలో నేత్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, నేత్ర పరిక్షలు నిర్వహిస్తుంది. అవసరం అయిన వాళ్ళకి ఉచితంగా మందులు , అద్దాలు ఇస్తుంది.

3. తల్లి మరియు బిడ్డ సంరక్షణ పేరుతో, వైధ్య సేవలు అందిస్తున్న ఎకైక ట్రస్ట్

>> ప్రసవం సమయంలలో , సరి అయిన వైధ్య సదుపాయం లేక మరణిస్తున్న మహిళలలో , మన రాష్ట్ర గ్రామీణ మహిళలే ఎక్కువ అని గ్రహించి , వైధ్య సదుపాయాలు అందిస్తున్నది ఎన్.టి.ర్ ట్రస్ట్.
>> ఈ అవకాశం మొదటగా రెండు జిల్లాలో ప్రారంభించటం జరిగినది. దీని ముఖ్య ఆవశ్యకత -
>> ప్రసవం సమయంలో కావలసిన వైధ్య సదుపాయాలు అందించటం.

>> ప్రసవం కి ముందు, తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలూ తెలియజేయటం.
>> తల్లి తండ్రులనుండి , పిల్లలకి సోకే HIV అంటి వ్యాధుల నుండి కాపాడటం.
>> ఎయిడ్స్, మరియు ప్రాధమిక వైధ్య అవసరలపై అవగాహనా సదసులు నిర్వహించటం.

4. విధ్యని అబ్యసించటం ప్రతి వ్యక్తీ ప్రాదమిక హక్కు అని నమ్మి, అనాదలకు , పేద విధ్యార్దులకు , మారుమూల గ్రామీణ విధ్యార్దులకు , విధ్యని అందించాలి అనే లక్ష్యం తో విధ్యా పధకంను నడుపుతుంది.


>> ఎన్.టి.ర్ మోడల్ స్కూల్ ని స్థాపించి, పేద విధ్యార్దులకు ఉచితంగా, కొంతమందికి రాయితీలపై , మంచి విద్య అందిస్తుంది.


5. గ్రామీణ అబివృద్ది పధకం


>> గ్రామీణ యువతకి ఉపాది అవకాశాలు అందించటం కోసం, పలు శిక్షిణ కేంద్రాలు నడుపుతున్నది.

>> సెక్యూరిటీ గార్డు ట్రైనింగ్ పధకం.
>> కంప్యూటర్ ట్రైనింగ్ పధకం.
>> డ్రెస్ డిజైన్ మరియు టైలరింగ్ .
>> మెషిన్ ఏమ్ బ్రోయెడరి (Embroidery).
>> చేతి ఏమ్ బ్రోయెడరి .
>> ఫాబ్రిక్ పేయిటింగ్ ...మొదలగు శిక్షిణ కేంద్రాలు నడుపుతుంది.

ప్రభుత్వం సైతం పటించుకొని ఎన్నో పనులు, ఎన్.టి.ర్ ట్రస్ట్ చేసి , ప్రభుత్వం కళ్లు తెరిపించినది.

>> ఉదాహరణ : సంక్షేమ హాస్టల్లో , దోమల బాద , చలి కాలంలో చలి బరించ లేక, విద్యార్దులు అవస్తలు పడుతుంటే , కొన్ని లక్షల దుప్పట్లు పంచి ప్రభుత్వాన్ని సైతం విస్మయం పరిచినది.

** ఎన్.టి.ర్ ట్రస్ట్ ద్వార , " చెప్పటం కన్నా చేయటం మిన్న" అన్న సూక్తి ఆచరించి చూపిస్తున్నది - మన తెలుగుదేశం .


** ఎలేక్షన్స్ వచినప్పుడు తప్ప , రాజకీయాలు మట్లాడను అన్నా పాలకుడు కావాలా (లేక) ప్రతి నిమిషం రాజికీయ ఎత్తుగడలతో పాలించే పాలకుడు కావాలో ఆలోచించుకోవలసిన తరుణం ఇది.

** సమాజ సేవ కొరకు మేము అంటు , రాక ముందే రాజకీయ ఎత్తుగడలు నడిపే వ్యక్తులు కావాలో , సమాజ సేవ కోసం, బావి పౌరుల బంగారు బవిషత్తు కోసం ఆలోచించే వ్యక్తులు కావాలో నిర్నయించుకోవలసిన సమయం ఆసన్నమయినది .

రండి ...........తరలి రండి........రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము.

Friday, August 8, 2008

చదువుల తల్లిని సైతం మోసం చేసినారు !!!!

1. బాసరలో IIT ని నెలకొల్పుటకు గత తెలుగుదేశం ప్రభుత్వము పాలన పరమైన అనుమతులు అన్నీ భారత ప్రభుత్వము నుండి స్వీకరించి, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింప చేసినది. గత NDA ప్రభుత్వము బాసరలో IIT ఏర్పాటుకు అనుమతి కూడా ఇచ్చినది .

2.ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ,బాసరలో మౌలిక వసతులు లేవు అని చెప్పి , సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, IIT ని మెదక్ కు తరలించినారు.

3. అభివృది అనేది రాష్ట్రము లోని అన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించాలి. బాసరలో IIT ని నెలకొల్పటం వల్ల , హైదరాబాద్ నుండి బాసర వరకు వున్నా 250 కిలోమీటర్స్ చాల అబివృద్ది చెంది వుండేది.

4. బాసరలో IIT ఏర్పాటు చేసి వుంటే, హైదరాబాద్ నుండి బాసరకు 4 లేన్ రహాదారి ,
డబల్ లైన్ రైల్వే ట్రాక్ వచ్చి వుండేది. విమానాశ్రయం కూడా నిర్మించుకొనే అవకాశం వుండేది. దీని వల్ల, గిరిజన ప్రాంతం అయిన ఆదిలాబాద్ తో పాటు, తెలంగాణా కూడా ఎంతో అబివృద్ది చెంది వుండేది.

5.బాసర విమానాశ్రయం లేదు అని కుంటి సాకులు చూపించి, బాసరకు IIT రాకుండా అడ్డుకున్నారు . ఇదే ప్రభుత్వం , కడపలో సొంత స్టీల్ ఫాక్టరీ ( బ్రహ్మని స్టీల్ ) కోసం , నాలుగు వేల ఎకరాలలో విమానాశ్రయం నిర్మించటానికి అనుమతి ఇచ్చినది.

6. బాసరలో IIT ని నెలకొల్పటం వల్ల, సరస్వతి దేవి నిలయమైన బాసరకి ప్రపంచస్థాయిలో గుర్తింపుతో వచ్చి, టూరిజం అబివ్రుద్దితో పాటు, ఆ ప్రాంత ప్రజల జీవన విధానం , నాగరికత ప్రపంచానికి తెలిసేది. మరియు, ఆ ప్రాంతలో వర్తక వాణిజ్య రంగాలకు నూతన అవకాశాలు వచ్చి వుండేవి.

7. చదువుల తల్లి సరస్వతి వుండటం వల్ల బాసరకి , ఒక అరుదైన గుర్తింపు వున్నది. IIT స్థాపన వల్ల , ఆ గుర్తింపు దేశ ప్రజల అందరికి తెలియటమే కాక, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగేది . మరియు, హిందూ సంస్కృతీ అబివృద్దికి మరింత ఉపయోగ పడేది.


దేవుడి పాలన అని చెప్పి, దేవుడిని సైతం ఇలా మోసం చేసినారు. ఇదేనా , మీ నిస్వార్ద పాలన??మీ అవసరాల కోసం, స్వార్ద పాలన చేస్తూ, ప్రాంతాల మద్య బెదాభిప్రాయాలు పెంచినారు. ప్రపంచమంత ముందుకి పోతుంటే, కులాల మద్య, ప్రాంతాల మద్య బెదాభిప్రాయాలు పెంచి, అబివ్రుద్దిలో రాష్ట్రాన్ని వెన్నక్కి నడుపుతున్నారు.

ఇదేనా ప్రజా పాలనా ??

నాలుగు సంవత్సరాలలో ఇడుపలపాయలో ఏమి జరిగినది??

1. కడప బ్రహ్మిని స్టీల్స్ లో విమాన ఆశ్రయం కోసం 4000 ఎకరాల భుమి ఇచ్చినారు.

2. హైదరాబాద్ ఇంటర్నేషనల్ విమానశ్రేయానికి కి ఇచ్చినది 5400 ఎకరాలు . కడప లో ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి ఇచ్చినది కూడా ఇదు వేల ఎకరాలు.

3. రెండు వందల కోట్లతో కడప నుండి పులివెందులకు 4 లేన్ రహదారి. కడప వాసులు సైతం విస్మయం చెందుతున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక్క వాహనం కూడా వెల్లదు . దానికి, ఇంత రోడ్డు అవసరమా అని ?
ఈ రహదారిపై కడపలో ఒక జోక్ నానుతుంది : మా ముఖ్యమంత్రి , పంటలు ఆర పెట్టుకొనుటకు , రెండు వందల కోట్లతో ఈ 4 లేన్ రహదారి వేయించినారు అని .

4. రాష్ట్ర ముఖ్యమంత్రిగా , పలుకుబడి చూపించి ఇదు వేల కోట్ల ఖరీదు చేసే రైల్వే లైన్ తెచ్చుకున్నారు. అదే ఎప్పటినుండో తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్న కరీంనగర్ - పెదపల్లి రైల్వే లైన్ కి 200 కోట్లు తీసుకోని రాలేకపోయినారు.

5. ఇడుపలపాయ ( మన ముఖ్యమంత్రి సొంత ఎస్టేట్ ) లో గోల్ఫ్ కోర్ట్ ( గోల్ఫ్ కోసం ప్లే గ్రౌండ్ ) .

6. ఇడుపులపాయ లో ఫార్ములా 1 రేసింగ్ కోర్సు . కావలసిన వసతులు అన్ని ప్రభుత్వము సమకూరుస్తుంది అట. పుత్రుడు ఇస్టపడితే ఎమైన చేస్తాడు ఈ తండ్రి . కావలి అంటే రాష్ట్రాన్ని రాసి ఇస్తాడు.

7. కడప లో టెక్స్ టైల్ పార్క్ . చేనేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల , పోచమ్మపల్లి లో ఒక్క టెక్స్ టైల్ పార్కు కూడా లేదు.

8.కొడుకు కోసం బ్రహ్మని స్టీల్ ప్లాంట్. దీనిలో పెట్టుబడి పెట్టటానికి, వేల కోట్లు ఇంత త్వరగా ఎలా సంపాదిన్చినారో , ఆ దేవుడికే తెలియాలి (దేవుడి పాలన కదా! )

9. మళ్లీ పుత్రుడి కోసం రగురాం సిమెంట్ ఫ్యాక్టరీ .

10. బాసర లో విమానాశ్రయం లేదు అని కారణం చూపి , రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం IIT ని మెదక్ కి మార్చినారు. కడపలో సొంత స్టీల్ ఫాక్టరీ ( బ్రహ్మని స్టీల్ ) కోసం , నాలుగు వేల ఎకరాలలో విమానాశ్రయం నిర్మించటానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం , అదే బాసరాలో , విమనాశ్రేయానికి కుంటి సాకులు చెప్పుతుంది.


ఏమిటీ ఈ పాలన, మళ్లీ పదవిలోకి రాము అని తెలిసి చేస్తున్నారా ?? ( వెలుగు వున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అని పెద్దలు చెప్పినది ఆచరించి చూపిస్తున్నారు ).

ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన తరుణం ఇది. తొమ్మిది సంవత్సరాల పాలనలో , ఆర్దిక సంస్కరణలు అమలు పరచి, సంపదను సృష్టిస్తే , సంస్కరణ పలితాలు పేదలకు అందవలసిన తరుణంలో ఇలా స్వార్ద పరుల చేతిలో ప్రభుత్వ పాలన ఉండటం బాదాకరం.


రండి ...........తరలి రండి........రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము.

Monday, August 4, 2008

వోటరు నమోదు కార్యక్రమం - అందరు ఉపయోగించుకోగలరు.

కొత్తగా పునర్విభజన చేయబడిన హైదరాబాదులోని 15 అసెంబ్లీ నియోజక వర్గాలతో కలిపి 294 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఫోటో వోటర్ల జాబితా ప్రచురించినారు .
ఇది అన్ని పోలింగ్ కేంద్రాలలో , వోటరు నమోదు అధికారుల కార్యాలయాలలో , సహాయ వోటరు నమోదు అధికారుల కార్యాలయాలలో , పోస్టాఫిస్ , మరియు http://www.ceoandhra.nic.in/ , పరిశీలనా నిమత్తం లబ్యమవుతుంది .


మీ పేరు నమోదు చేయుటకు - ఫారం-6 ని దరఖాస్తు చేయండి .

1-1-2008 నాటికి 18 years నిండిన వారు స్కూల్ / కాలేజి సర్టిఫికెట్స్ , (ఆర్) జనన ద్రువీకరణ పత్రాలు , వోటర్లుగా నమోదు అయిన తల్లి దండ్రులు ఇచ్చిన అవిడిఫేడ్ ను జత చేయవలెను.

ఎవరికి దరకాస్తు చేయాలి ?

మీ నియోజక వర్గ వోటరు నమోదు అదికారులైన sub - collector / రెవెన్యు డివిజినల్ కార్యాలయాలలో , సహాయ వోటరు నమోదు అధికారులైన తహసిల్దారు కార్యాలయాలలో దరకాస్తు తీసుకోవచ్చు. లేక, online ద్వార ఫారం - 6 ను సమర్పింపవచ్చు. దీని కొరకు http://www.ceoandhra.nic.in/ సందర్శించండి .

దరఖాస్తు ఫారాలు లభించు చోటు :

పైన చెప్పిన కార్యాలయాలలో దరఖాస్తు పత్రాలు లబించును. మరియ http://www.eci.gov.in/ , మరియు http://www.ceoandhra.nic.in/ ల నుండి దరఖాస్తు పత్రాలు డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

దరకాస్తు ఫారాలు దాఖలు చేయవలసిన తేదీలు :

01-08-2008 నుండి 20-08-2008 వరకు అన్ని దినము లలోను దాఖలు చేయవచ్చు. (సెలవు దినములలో కూడా దాఖలు చేయవచ్చును ).

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?