ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Tuesday, November 3, 2009

ఎవరు కావలి ??

"అభివృద్ధి" కావాలా లేక "అరాచకం" కావాలా...."మత చాందసమా" లేక "సామరస్యమా"..."శవ" రాజాకీయామా లేక "సేవా" రాజకీయమా...వరద సాయం చేస్తున్న పార్టీ కావాలా లేక వరద నష్టం పెంచిన పార్టీనా....
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు వున్న 294 నియోజకవర్గాల ప్రజలు అందరు వచ్చి స్థిరపడ్డ హైదరాబాద్ "మళ్ళీ మతతత్వ శక్తుల చేతిలోకి వెళ్ళాలా లేక ప్రజల అందరి భాగస్వామ్యంతో ప్రపంచపటం లో అభివృద్దికి HUBగా నిలిపిన తెలుగుదేశం పాలనలోనే వుండాలా "

కృష్ణా నదీ జలాలతో గొంతు తడిపిన పార్టీ కావాలా లేక మురుగునీటితో ప్రజల ప్రాణాలను హరించిన రాక్షస పార్టీ కావాలా ......

FLYOVERSతో ట్రాఫిక్ సమస్యలు తీర్చిన పార్టీ కావాలా లేక అవినీతితో FLYOWERS కూల్చిన పార్టీ కావాలా........
రైతు బజార్లతో నగర పౌరులకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చిన పార్టీనా లేక దంపుడు బియ్యం తినమనే ఉచిత సలహాలు ఇచ్చే పార్టీనా ......

హైదరాబాద్ ని సాంకేతిక అభివృద్దితో సైబరాబాద్ ని తెచ్చిన పార్టీనా లేక భూకబ్జాలు,దోపిడీలు,గూండాలు, బాంబు దాడులతో హై"ఢర్"బాదు గా మార్చిన పార్టీనా....
MMTS రైలుతో METROకి మార్గం సుగుమం చేసిన పార్టీనా లేక MAYTAS అవినీతిలో భాగం పంచుకుని METROని అటకేక్కించిన పార్టీనా.......
ప్రపంచ ప్రసిద్ధ IT Companies ని తెచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచిన పార్టీనా లేక ఆర్ధిక నేరాలతో(SATYAM),కుంభకోణాలతో(MAYTAS) ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకునే ప్రభుత్వమా

"e-seva", "e-Governence" ల ద్వారా ప్రభుత్వ పాలనను ప్రజా వాకిట ముందుకు తెచ్చిన పార్టీనా లేక అవినీతి ప్రోత్సాహంతో ప్రభుత్వ పాలనను అస్తవ్యస్థం చేస్తున్న పార్టీనా

మతతత్వ శక్తులతో లోపాయకారీ ఒప్పందాలు పెట్టుకునే పార్టీ కావాలా లేక ప్రజా సమస్యలు తీర్చిన పార్టీ కావాలా

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం ఎంత? HYD నగర ప్రజలకు అందిన సౌకర్యాలు ఎన్ని? ......నేటి అవినీతి పాలనలో ప్రభుత్వ ఆదాయం ఎంత? , HYD ప్రజలకు చేరుతున్న సాయం ఎంత ?

లుంబిని పార్కు,మక్కా మసీదు,గోఖుల్ చాట్లలో జరిగిన బాంబు పేలుళ్లకు కారకులు ఎవరో ఆలోచించలేమా .....ప్రపంచంలో ఏ మూల తీవ్రవాద దాడులు జరిగినా HYDERABADనగరంలో మూలాలు వుండటానికి కారకులు ఎవ్వరో చెప్పలేరా.......
చిన్న పాటి వర్షాలకే మన నగర రోడ్లు చెరువులుగా మారాలిసిందేనా .....నిత్యం బిందెడు మంచినీటి కోసం మన ఆడపడుచులు కుళాయిల వద్ద పోట్లాడుకోవాలిసిందేనా.......రోజు Traffic నరక యాతనలతో సగం ఆయుష్షు కాలుశ్యానికే అంకితం చేయాలా.....చుక్కల నంటిన ధరలతో ఆర్ధిక భారాన్ని ఇంకెన్నాళ్ళు మోయాలి .....India కి అభివృద్ధి పాఠాలు నేర్పిన మన Hyderabad నేడు నిత్యం మురుగు నీటిలోనే మగ్గి పోవాలా ......నిత్యం తీవ్రవాద నీడలో మన నగరం బిక్కు బిక్కు మంటూ బతకాలా....... మధ్యతరగతి ఉద్యోగి సొంత ఇంటి కళను నిజం చేసుకునే అవకాశం నేడు నగరంలో వుందా......

పదవుల కోసం పడుతున్న ఆరాటం ప్రజా సమస్యలు తీర్చటం మీద ఎంత చూపిస్తున్నారు ...
Congress/Majlis కూటమిలో ఏ పార్టీకి ఓటు వేసినా అది అంతిమంగా తీవ్రవాదానికి మద్దతు తెలిపినట్లే ...
ఓ చదువుకున్న ఓటరు మహాశయా ఒక్క సారి ఆలోచించు....Hyderabadకి మంచి చేసే పార్టీ ఏదో ముంచే పార్టీ ఏదో విశ్లేషించుకుని తగిన నిర్ణయం తీసుకో .......ప్రజలను ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి చేస్తున్న ఈ రాక్షస పాలనకు నీవు GHMC electionలో తగిన గుణపాఠం నేర్పాలి ........

TDPకి VOTE వేసి HYD స్ఫూర్తిని చాటుతావో లేక Congress/Majlis కూటమికి వేసి మతతత్వ శక్తులకు మద్దతు పలుకుతావో నీవే నిర్ణయించుకో ..........కానీ VOTE మాత్రం వెయ్యకుండా ఇంట్లో కుర్చుని ఏడుస్తూ బతకమాకు ......

VOTE హక్కుని వినియోగించుకుందాము-- ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంచుదాము


మీ అబిప్రాయాలు తెలుప వలసిన చిరునామా : manaksoamtelugudesam@gmail.com

Thursday, October 1, 2009

ఇదే జగన్నాటకం !!! ప్రజలు ప్రేక్షేకులు ??

టాటా , రిలయన్స్ , బజాజ్ , ఇన్ఫోసిస్ , విప్రో , ఆదిత్య గ్రూప్ వంటి మొదలగు ... మన దేశ కార్పోరేట్ లకు , బిలినియర్స్ గా అవతరించటానికి కొన్ని దశాబ్దాలు పట్టినది .

అదే YSR & Co కుటుంబం , 4 సంవత్సరాల 6 నెలల కాలంలో 78000 ( అక్షరాల దెబ్బే ఎనిమిది వేల కోట్లు ) కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించ గలిగినారు .

మన రాష్ట్ర బడ్జెట్ ఒక లక్ష కోట్లు -> YSR కుటుంబం మార్కెట్ పెట్టుబడులు డెబ్బయ్ ఎనిమిది వేల కోట్లు (78000 కోట్లు ) .

NTPC ( 23000MW కెపాసిటీ ) లో వాటా : 290 కోట్లు
సండూర్ పవర్ (22.50 MW కెపాసిటీ ) లో వాటా : 675 కోట్లు
జగతి పబ్లికేషన్స్ ( సాక్షి మరియు ఇందిరా టెలివిజన్ మాతృ సంస్థ ) మార్కెట్ పెట్టుబడులు : 3600 కోట్లు ( ఇంక మొదలు మొదలు పెట్టకముందే ). ఇది జగన్నాటకమా ?? లేక ....??

7800 కోట్ల సత్యం స్కాం ని దేశ లో అతి పెద్ద ఆర్దిక స్కాం గా పిలిస్తే.... 78000 కోట్ల YSR & Co కుటుంబం స్కాం ని ఏమని పిలవాలి ??

1956 లో ఆంధ్రప్రదేశ్ పవర్ ఉత్పత్తి సామర్ద్యం - 213MW . 53 సంవత్సరాల లో మనము సాదించిన ఉత్పత్తి సామర్ద్యం - 12500MW .

అదే అతేన ఎనర్జీ (Athena Energy , రెండు సంవత్సరాల క్రితం YSR కుటుంబం మొదలు పెట్టిన మరో కంపెనీ ) , ఉత్పత్తి సామర్ద్యం ( 7 సంవత్సరాల లో ) - 14000MW .

రఘురామ్ సిమెంట్స్ లో YS జగన్ వాటా (కొన్నప్పుడు ) : 45 కోట్లు . ఇప్పుడు అదే వాటా వేల్యూ :
6500 కోట్లు









Monday, August 31, 2009

ఎన్ . టి. ఆర్ విద్యాజ్యోతి

"ప్రార్దించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న"

ఎన్ . టి. ఆర్ విద్యాజ్యోతి

" ఒక మేధావి మాత్రమే 10 మంది మేధావులను తయారుచేయగలరు "
ఎన్ . టి. ఆర్ ట్రస్టు ద్వారా బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లల భవిష్యత్‌కు చక్కని మార్గం ఏర్పాటు చేసుకొనేందుకు సహకారాన్ని అందిస్తున్నాం. Manchi భవిష్యత్తుకు జ్ఞానమే సరైన మార్గమని మా నమ్మకం. జ్ఞానం సంపాదించటానికి , వినియోగించటానికి మంచి చదువు చాలా అవసరం.


బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలను విద్యావేత్తలుగా , నాయకులుగా తీర్చి దిద్దటానికి మా ట్రస్ట్ తరుపున హైదరాబాద్ శివారులలో చిలుకూర్ వద్ద అన్ని వసతులు గల స్కూల్ ని 2005 లో 131 మంది పిల్లలతో నెలకొల్పీనాము. గండిపేట వద్ద విశాలమైన భవన సముదాయంతో ఈ స్కూల్ నెలకొల్పాపడినది. పిల్లల చదువుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. విద్యార్ధులంతామంచి ఫలితాలను సాధించాలన్నది మా ధృడ సంకల్పం.

2005 లో 131 మంది విద్యార్ధులతో ప్రారంభించబడి 2006 లో 302 , 2007 లో 487 , 2008 లో 604 ఇప్పుడు 2009 లో 650 మంది విద్యార్ధులకి అభివృద్ధి చెందినది. ప్రస్తుతం ఈ స్కూల్ లో 650 మందికి కాను 402 మంది విద్యార్ధులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కల్పిస్తున్నాం.

ఎన్ టి ఆర్ మెమోరియల్ ట్రస్ట్ samanya ప్రజల జీవితాలలొ మంచి మార్పు కోసం ప్రయతిస్తున్న Seva సంస్థ. మేము అన్ని వర్గాల ప్రజలను కుల, మత , వర్గ భేదాలు లేకుండ అందరిని సమానంగా ఆదరిస్తునాం. వీరిలో కొంతమంది తల్లిదండ్రులను కొల్పోయినవారు. కొంతమంది ఆర్ధికంగా వెనుకబడినవారున్నారు.

మా విన్నపం :
ప్రస్తుత corporate మరియు concept పాఠాశాలల పరిస్తితులలొ మనం కూడ మన పాఠాశాలను అత్యుత్తమ ప్రమణాలతో నిర్వహిస్తున్నాం. దీనికి చాలా ఖర్చు అవుతుంది. దీనికి మన థాతలు ఇచ్చె విరాళాలె మాకు సహాయపడతాయి.

ఒక విద్యాదాతగా మీరు ఒక పేద విద్యార్ధికి ఎన్.టి.అర్ విద్యాజ్యొతి పథకంతో తన జీవితాన్ని మెరుగు పరచె దిశగా సహాయపడవచ్చు. భవిష్యత్తులో ఒక మంచి వ్యక్తిగా ఎదగటానికి తద్యారా సమాజ అభివ్రుద్దికి మీ వంతు సహయం చేసిన్నట్టు.

ఒక విద్యార్ధికి ఒక సంవత్సరం కాలం చదివించాలంటే హాస్టల్ వసతితో సహా రూ.30000/లు ఖర్చు అవుతుంది. ఈ రూ.30000/లు విరాళాం ఇవ్వటం వల్ల మీరు ఒక విద్యార్ధికి మంచి విద్యను, వసతిని అందించగలరు.
మీ విరాళాలకు ఆదాయపన్ను చట్టంలోని 80జి కింద పన్ను మినహాయీంపు లభిస్తుంది.
మీరు ఈ విరాళను ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్టు పేరు మీద DD లేద Cheque రూపంలో ఇవ్వవచ్చును.

ఇతర వివరాలకు :

శ్రీ పి. రఘురామారావు (సి.ఇ.ఓ)
ఈ మైల్ : ceo@ntrtrust.org
వెబ్ సైట్: www.ntrtrust.org.
మెమోరియల్ ట్రస్టు 040 30699890


"మిత్రులరా
మనం రూ.30000/లు ఇవ్వలి అని లేదు , మన శక్తి కొలది ఎంతైన ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద DD/Cheque పంపగలరు. మీరు మా మీద అభిమానంతో ఒక్క రూ. ఇచ్చినా ఆనందంగా స్వీకరిస్తాము.
"
మీరు మీకు తెలిసిన వారికి మేము వేల్లి కలసి ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్ గురించి వివరించమన్నచో మాకు ఫొనె / ఈమైల్ వివరములు ఇచ్చినచో వేళ్ళి కలసివస్తాము.


:- ఎన్.టి.అర్ మెమోరియల్ ట్రస్ట్

Thursday, August 13, 2009

కరువు కోరల్లో చిక్కుకున్న అన్నదాత ఆర్తనాదం .....

అన్నదాత కరువు కోరల్లో చిక్కుకుని బిక్కు బిక్కు మంటుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా లేక ప్రభుత్వాన్ని నడుపుతున్న వారే మొద్దులా ..........

వరుసగా 5 సంవత్సరాలు పుష్కల వర్షాలు పడ్డా ఎందుకు నేటి దుస్థితి దాపురించింది.....రాష్ట్రంలో వున్న మొత్తం మండలాలు ఎన్ని....అందులో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదు అయిన మండలాలు ఎన్ని....ఎన్ని మండలాలలో రైతులు దుక్కులు దున్నారు ,విత్తనాలు విత్తారు ,విత్తిన విత్తనం ఎంత శాతం మొలకేత్తిందో ఏలిన వారికి ఎరుకేనా ......అస్సలు ప్రభుత్వం దగ్గర వాస్తవ ఆధార సమాచారం వుందా లేక "సాక్షి" పత్రికలో వచ్చే సమాచారమే ప్రభుత్వ సేకరించిన సమాచారంగా ప్రకటిస్తున్నారా ......

వ్యవసాయ రంగం మీద ప్రభుత్వానికి అస్సలు అవగాహన వుందా.....అవగాహన వుంటే ఏ పంట ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు ,ఏ పంటకు ఎంత నీరు కావలి, ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుంది,......ఎంత దిగుబడి వస్తుంది .....మద్దతు ధర ఎంత లభిస్తుంది .......మార్కెట్లో వినియోగదారుడికి ఎంతకు దొరుకుతుంది అని ఒక్క సారి ఆలోచిస్తే నేటి దుస్త్తితి వచ్చేదా....ప్రకృతి విపత్తులలో కూడా కృత్రిమ కొరతలు సృష్టిస్తున్న దళారులను ప్రభుత్వం ఎందుకు అదుపుచేయలేకపోతుంది ???? ప్రభుత్వంలోనే దళారులు వున్నందువల్లనా?? లేక నేటి పాలకులే దళారులా???????


రాష్ట్రంలో ఇడుపులపాయ ఒక్కటే వ్యవసాయ క్షేత్రమా....దాని యజమాని అయిన ముఖ్యమంత్రి ఒక్కడే రైతా ........శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాక ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు ఎన్ని వేల ఎకరాలు బీడు పడ్డాయో.... ఎందరు రైతు బిడ్డలు రోడ్డున పడ్డారో ......అడ్డగోలు ప్రభుత్వానికి ఎందుకు అర్ధం కావటంలేదు.....

ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆకర్షించటంలో వున్న శ్రద్ద ....కరువును అంచనా వెయ్యటంలో ఎందుకు చూపలేకపోతున్నారు .....సొంత పార్టీలో వున్న వానదేవుడి అనుగ్రహం పొందలేక పోతున్నారా?? ...లేక వాన దేవుడు రాజీనామా చేస్తే అతని బదులు "కరువు రాకాసికి " సభ్యత్వం ఇచ్చారా ...ఏది నిజం?? ..ఏది మీ అస్సలు నైజం??? ........

నాడు అధికారం కోసం చేవెళ్ళ చెల్లెమ్మ దగ్గర నుంచి శ్రీకాకుళం చిన్నోడి దాక పాదయాత్ర చేసారు .....మరి నేడు ఎందుకు గ్రామాలలో మోటారు యాత్ర చెయ్యటానికి కూడా జంకుతున్నారు.....అవసరం తీరిందనా ..లక్ష్యం నేరవేరిందనా ....స్వప్నం సాకారం అయిందనా ..ఎందుకు ?????.......అవునులే నేను ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం నెరవేరింది కదా ... నా కొడుకు కోటీశ్వరుడు అవ్వాలన్న స్వప్నం సాకారం అయిన "సాక్షి"యాలు కనిపిస్తున్నాయి కదా ఇంక సామాన్యుల చింతలు ఎలా కనిపిస్తాయిలే ......

కరువు పరిస్తితులు ఇలాగే వుంటే ...బీళ్ళు ఇలాగె బీటలు వారితే రేపటి సామాన్యుడి పరిస్థితి ఏంటో ఆలోచించారా....జలయజ్ఞ ఫలాలు ఎక్కడ ...మేఘమదానం యొక్క సందేశాలు ఏవి....యజ్ఞంలో మిగిలింది చివరికి బూడిదేనా....మధనంతో జరిగేది రైతులకు అంతర్మదనమేనా .....

పల్లకీలో కూర్చుంటే కాదు పంట పొలాల్లో నడిస్తే తెలుస్తూంది అన్నదాత ఆక్రందన .......నీటి చుక్క కోసం అన్నదాత కన్నీటి చుక్క ఎలా నేల జారుతుందో కనిపిస్తుంది.......అవునులే అన్నదాతల కడుపు మంటలు,కూలింగ్ అద్దాలు పెట్టుకున్న ద్రుతరాస్ట్రులకు ఎలా కనిపిస్తుందిలే ......గడ్డి(పశుగ్రాసం) లేక పశువులు కలేబరాలకి తరలిపోతుంటే... అవినీతి గడ్డి తినే ప్రభుత్వానికి ఆ మూగ జీవాల గోడు ఎలా వినపడుతుందిలే .......

ఎండుతున్న గొంతులతో చలమ గుంతల్లో నీటి కోసం ఆడపడుచులు చేస్తున్న వలస యాత్రలు ....పాద యాత్రలు చేసిన మీకు కనిపించకపోవటం వెనుక వున్న అస్సలు రహస్యం..... మీరు మొదలు బెట్టబోయే "రాజీవ్" మినరల్ నీటి( ఓటు) వ్యాపారమే అనే నిజం మీ నైజం తెలిసిన ఎవరికి అయిన తెలియదనుకుంటున్నారా ..

నాడు అనంతపురంలో అంతులేని క్షామం వచ్చింది అని మీ విదేశీ అమ్మను తెచ్చి అర్ధంలేని ఆవేదన వెల్లగక్కారే ... .... మరి నేడు మీ అంత:పురం మొత్తం అదిక ధరలతో,ఆకలి బాధలతో ,కరువు కరాల నృత్యాలతో కకావికలమవుతుంటే కళ్ళు వుండి చూడలేని దృతరాష్ట్ర పాలన చేస్తున్నావా పా(ప)లకా .......
నాడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటేనే చంద్రబాబుని, ఆత్మహత్య చేసుకో లక్ష రూపాయల ఎక్షగ్రేశియో ఇస్తానన్న వ్యక్తి ,నేడు ఇన్ని రైతు ఆత్మహత్యలకు కారణం అయినందుకు ,ఎన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవాలి నాయకా ...అవునులే అధికార దాహంతో ఆత్మవంచన చేసుకునే పదవీ వ్యామోహులకు ప్రజల దాహాలు,అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు పడతాయిలే .......

జగం అంతా దోచి పెట్టి నీ జగన్ కోసం,ముడుపుల పాయలో మూటలు కట్టే దానికే నీకు ఓబులాపురం అంత పెద్ద ఘని దొరికింది....... ఇంక జనం యొక్క దీన గాధలు ఎక్కడ పడతాయిలే మీకు ............

బుద్ది మాంద్య వయస్సులో విత్త మంత్రిగా వుండి చెత్త మాటలతో ప్రజా వేదిక పరువు తియ్యటంలో వున్న శ్రద్ద, కరువు రైతుకి ఆర్ధిక సహకారం అందించటంలో లేదంటే ప్రభువుల చిత్త శుద్ది ఏంటో ప్రజలకు ఇట్టే అర్ధం అవుతుంది ......

గల గల పారే "గోదావరి" బాబ్లీ పుణ్యాన వెల వెల పోతున్నా .....బిర బిర పరిగెత్తే కృష్ణమ్మ కర్ణాటక పుణ్యాన కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నా ..తుంగభద్రమ్మ బెంగతో భంగపడుతున్నా...., ఏలిన వారు మాత్రం జలయజ్ఞం చేస్తున్నాము ...ధనయజ్ఞం పుట్టిస్తాము అంటూ చివరికి ప్రజల బతుకులను భగ్నం చేసి బూడిద పూసే ప్రయత్నంలో వున్నారు ....................

కరువు మీద అరుస్తున్న ప్రతిపక్షాలను కరుస్తా అంటూ బెదిరిస్తూ, రౌడీ రాజకీయం చేస్తున్న ప్రభుత్వ పెద్దలను... ఆంధ్రా చౌరస్తాలో వివస్త్రలను చేసి కొట్టే రోజు కోసం ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారు .......

నాడు కరువు రోజుల్లో "నీరు - మీరు " ద్వారా ప్రజాభాగస్వామ్యంతో "జన్మభూమి"లో నీటి ఎద్దడిని ఎలా ఎదురుకున్నామో, నేడు "బారు --బీరు" ఆదాయం మీద ఆధార పడ్డ ప్రభుత్వానికి తెలిసి రావాలని ...... నేడు అలాంటి చిత్తశుద్దితో ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చే ప్రయత్నం చెయ్యాలి అని అర్దిస్తున్నా ..........
ఇట్లు
మీ రైతుబిడ్డ

Tuesday, August 11, 2009

ప్రజలకి సైన్ ఫ్లూ ...పాలకులకు మైండ్ ఫ్లూ ???

కరువు రైతుల ప్రాణాలు తీస్తుంది . దుక్కిచేసి , నారు పోసి , సాగుచేసి , వానకోసం ఎదురు చూసి .... కళ్ళముందే పంట ఎండి పొగా , చేసిన అప్పులు పెనుబారమయే , తీర్చే దారి కాన రాక , ఎండిన పొలాల్లోనే రైతులు ఆత్మ హత్య చేసుకుంటున్నారు .





కళ్ళ ఎదుట నిజాలు కనపడుతుంటే... అధికారం అనే మత్తులో వున్నా ఈ రాజకీయ నాయుకుల ( రైతుల కోసమే మేము అని చెప్పుకొనే ) ప్రగల్బాలు చుడండి ...

తాగి అప్పులు పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులు - MP , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రభువులు ఇలా మాట్లాడటం ఇదే మొదట సారి కాదు :

రైతులు తిన్నది అరగక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - బండారు దత్తాత్రేయ
రైతులు తమ బిడ్డల పెళ్ళిళ్ళు సందర్బంగా ఆడంబరాలకు , విలాసాలకు పోయి , పలితంగా అప్పుల పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - జేసి దివాకర్ రెడ్డి

యువత ఆలోచించాలి .... యువత ముందడుగు వేయాలి .... సమర్ద వంతమయిన నాయకత్వాన్ని తీసుకొని రావాలి .

ఇట్లు ,

మీ తోటి యువత

Friday, July 31, 2009

వీరా మన లీడర్స్ ??


ఒక ఆర్థిక మరియు శాసన సభ వ్యవహారాల మంత్రిగా మాట్లాడాల్సిన మాటలా ఇవి.
గతంలో సాటి శాసన సభ్యుని చేతులు తీసేస్తానని బెదిరించారు.....ఇప్పుడు ఇలా.

నేను ముసలి వాడిని అయిపోయాను అని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికవ్వడానికి బద్దకం వేసో లేక భయపడో అడ్డదారిలో ఎం ఎల్ సి అవ్వడానికి అడ్డుపెట్టుకొన్న వృద్దాప్యం ఏమయ్యింది?
ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధుల సభలో సభ వ్యవహారాలను నడుపడానికి అలా ఎన్నిక అవ్వకుండా ఎం ఎల్ సి గా వచ్చిన వ్యక్తికి ఇవ్వడం చట్ట పరంగా సమంజసం అవ్వోచ్చేమో కాని నైతికంగా కాజాలదు.
అలాంటి వ్యక్తి వయసుకు తగినట్టు కాక నువ్వు మగాడివా అంటూ మాట్లాడడానికి అర్హత ఉన్నట్టా?
లక్ష కోట్లతో బడ్జట్టులు పెంచి పెరుగుతున్న ధరలపై అదుపు సాధ్యంకాక అసెంబ్లీలో ఆవేశ పడి మగాడివా అంటూ మాట్లాడడం బదులు మంది మందు కొడితే వచ్చే ఆదాయంతో మన్ను తిన్న పాములా మనం ఎందుకు ఉన్నాం అని స్వపక్షం పక్కకు తిరిగి ప్రశ్నించుకొని ఉంటే ప్రజలు హర్షించే వారు.
మన (అ)ధర్మ ప్రభువులు జెపి గారికి మరియు (ముసుగు) మధ్యవర్తి చిరు గారికి ఇదేమంత విషయం కాదు.. ఎందుకంటే, అక్కడ తెలుగుదేశం వాళ్ళను ఏమీ అనడానికి లేదు కదా.. పైగా, ఏమన్నా అందామంటే, మనది విపక్షమైనా మనకి స్వపక్షమైన కాంగ్రెస్ ని విమర్శించినట్లవుతుంది మరి.
ప్రజలచేత ఎన్నుకోబడిన శాసనసభ్యుల్ని అవమానపరచడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి వీరికి చిన్న విషయాలు.. వీరి ప్రయత్నమంతా మరో ప్రపంచావిష్కరణ కోసం.. రాజకీయాలను కడిగేస్తామని ప్రగల్భాలు పలకడం, ముసుగు దొంగల్లా మరింత భ్రష్టు పట్టించడం మాత్రమే వీరికి తెలిసిన విద్య.
ఎన్నికల ముందేమో పరోక్ష సహకారం ఇప్పుడు ప్రత్యక్ష సహకారం అని భావించవచ్చా?
:- మార్పు కావలి అంటే యువత ముందుకి రావాలి
- మధు దాపర్తి , బాబు

Tuesday, July 21, 2009

ఓ కార్యకర్త అభిప్రాయం

పొత్తుల వల్ల నష్టపోయాము అని అంటున్నారు.. నిజమే, కానీ.. ఇప్పుడొచ్చిన నష్టం తాత్కాలికం.. నిజం.

అదే ఆరోజు పొత్తులు లేకుండా వెళ్ళినట్లయితే, కూటమిలోని మిగతా పార్టీలు కచ్చితంగా చిరు చెంతన చేరేవి. అప్పుడు ఎంత లేదన్నా యాభైకి పైగా సీట్లు వాళ్ళు సాధించేవారు. ఆ పరిస్థితుల్లో మనకైనా, కాంగ్రెస్ వాళ్ళకైనా వారి మద్దతు అవసరం వచ్చేది. ఫలితంగా అయిదేళ్ళు చిరంజీవి కీలకమయ్యి తిరుగులేని బలాన్ని తన పార్టీకి కూడగట్టుకునేవాడు. అలా వచ్చే నష్టం శాశ్వతం. ఇప్పుడు ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు, రాష్ట్రాన్ని ఏలే సత్తా ఎవెరేవరికి ఉందో మనకి సొంతంగా తొంభైకి పైగా స్థానాల్ని ఇచ్చి చాలా స్పష్టంగా చెప్పారు. తెరాస, వామపక్షాలు మరియు పిఆర్పీల స్థాయి ఎంతో చాలా బాగా చెప్పారు.

కాకపోతే కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలకు మన కార్యకర్తను ఇప్పుడు మరొక అయిదేళ్ళు బలిచెయ్యాలి. కాదు, కాకూడదు!!. మన బలం బలగం రెండూ పెరిగాయి అసెంబ్లీలో. మనకార్యకర్త రక్షణ కోసం సర్వశక్తులూ ఒడ్డాలి. ఇంకా ఇంకా మెరుగైన వ్యవస్థను నెలకొల్పి, స్థానిక నేతను ప్రతి కార్యకర్తకు చేరువ చెయ్యాలి. వాళ్ళకే కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉండేలా చూడాలి.లోక్ సత్తా వల్ల జరిగిన అనర్ధం ఏంటో స్పష్టంగా తెలిసింది.. మన పరాజయానికి ఇంకొకరిని భాద్యత వహించమనడం నిజమైన వ్యక్తిత్వం అనిపించుకోదని నాకూ తెలుసు.. కానీ మనం చాలా చోట్ల పరాజయం చెందలేదు. ఏకంగా ఇరవైనాలుగు సీట్లు లోక్ సత్తా క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయామని మీడియా అంతా కోడై కూసింది.. వందలో అరవైమంది మంచి నలభైమంది చెడ్డ అనుకుంటే, ఆ అరవైలో పాతికమంది మేము అతిమంచి వాళ్ళమని అతిగా ఆలోచించి, మేము ఎవరితోను కలవము అని విడిపోతే, మిగిలిన ముప్పైఅయిదు మంది మంచివాళ్ళు నలభైమంది చెడ్డవాళ్ళముందు పరాజితులుగా నిలిచారు.. ప్రజలు గెలిచారు అని చెప్పుకుంటున్న వీళ్ళు, నిజానికి ప్రజాతీర్పుని ఓడించారు. అర్హత లేనివాళ్ళకి సింహాసనం కట్టబెట్టి చారిత్రక తప్పిదం చేసారు. మీడియా ముందు కూర్చొని వినసొంపైన నీతులు వల్లించే వీళ్ళు, వారి చేష్టల వల్ల ప్రజలకి జరిగిన నష్టమెంతో గ్రహిస్తే మంచిది.

ఇక చిరు గురుంచి ఎంతచెప్పినా తక్కువే, ఏమిచెప్పినా ఎక్కువే..!! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. ఏకంగా ఎన్టీఆర్ తో పోల్చేసుకుని, ప్రజలే వచ్చేయ్యమన్నారు అని గాలికూతలు కూస్తూ అభిమానుల మానాభిమానాన్ని పణంగా పెట్టి నమ్ముకున్నోళ్ళ దగ్గరనుంచి కోట్లు కొల్లగొట్టి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో తన స్థాయి స్థానం ఏంటో చవిచూసాడు. దేశం ఎమనుకుంటుందో ఈ లింక్స్ ఓపెన్ చేసి చదవండి.
http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Chiranjeevi-loses-not-just-elections-but-respect-too/articleshow/4544803.cmshttp://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Former-aide-lashes-out-at-Chiru/articleshow/4544263.cms
ఇకఇక మన తప్పిదాలు విషయానికి వస్తే, అంతగా ప్రభావం చూపకున్నా, అప్పటికి వేరే దారి లేకున్నా, తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో పుట్టి, తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పార్టీ, తన ఉనికి కోసం తెలుగువాడినే విభజించాలి అనే నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఒక వైఫల్యం అయితే, పదిహేను సంవత్సరాల పాలనలో మనవల్ల రాష్ట్రానికి జరిగిన మేలుని జనంలోకి సమర్ధంగా తీసుకువెల్లకుండా కాంగ్రెస్ అవినీతి గురించే ఎక్కువ మాట్లాడుతూ వాళ్లకి ఫ్రీగా పబ్లిసిటీ చేసిపెట్టాము.

ఏది ఏమైనా, పోరాడాం, లక్ష్యానికి అతిచేరువలో ఆగిపోయాం.. మనకి తెలియని ప్రతిపక్షము కాదు, మనము అనుభవించని అధికారము కాదు ఇవాళ భాధపడటానికి!! గెలిచామని రేచ్చిపోయేవాడు, ఒడామని ఏడ్చేవాడు ఇద్దరూ మరొక పోటీకి నైతికంగా అనర్హులే. గెలుపోటములు ఎలా ఉన్నా రేయింభావాళ్ళు శ్రమించిన చంద్రబాబు గారిని, పార్టీ కోసం ఏమీ ఆశించకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి జెండాను మోసిన కార్యకర్తలను, రాజకీయాలకు దూరం అంటూ ఇంట్లోనుండి ఎప్పుడూ బయటకు రాని వారు కూడా భాద్యతగా ఫీల్ అయ్యి వచ్చి శ్రమించిన గ్రామస్థాయి పెద్దలను, ఉడతా భక్తిగా తమవంతు సాయం అందించిన 'మనకోసం-తెలుగుదేశం' విభాగాన్ని మనమంతా అభినందించి తీరాల్సిందే!!.

Friday, May 22, 2009

ఓ కార్యకర్త నివేదన

ఓ ప్రియమయిన తెలుగుదేశం కార్యకర్తా ......


అన్నగారి ఆశయాల సాధనకు చంద్రన్న సారధ్యంలో ,తెలుగుదేశం పార్టీ కోసం రాత్రింబవళ్ళు పోరాడినందుకు ముందుగా అభినందనలు .........

ఓటమిని , గెలుపును ఒకేలా తీసుకునే నీ ఓర్పుకి .. పార్టీ గెలుపు కోసం ప్రజా సమస్యల మీద మళ్ళీ యుద్దానికి సన్నద్ధం అవుతున్న నీ మనోధైర్యానికి జోహార్లు.............


నీ లాంటి క్రమశిక్షణ కలిగిన, సైనికుడి లాంటి కార్యకర్త వుండటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం .......అందుకేనేమో పార్టీ కుడా, "త్యాగాలకు వెనుతియ్యని దేశభక్తులారా" అంటూ నీ విలువను దేశభక్తులతో పోల్చి తన గీతంలో నీకు అగ్ర పీఠం వేసింది ......

రాజకీయాలలో కార్యకర్త అనేది చాలా విలువయిన ,ముఖ్యమయిన దశ.... ఈ దశలో ప్రజా సమస్యల మీద , సామజిక అంశాల మీద (సామాజికం అంటే కులం అనే భ్రమ వద్దు) ,రాజకీయ ఆర్ధిక అంశాల మీద అవగాహన పెంచుకోవటానికి ....పార్టీ యొక్క సిద్దాంతాలను , లక్ష్యాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళటానికి ...ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీని నడపటానికి , పార్టీ నాయకత్వానికి, అవసరమయ్యే సూచనలు చెయ్యటానికి దొరికే ఒక చక్కని క్రియాశీల పాత్ర ....... క్రమశిక్షణతో ,దీక్షతో కార్యకర్త అనే మొదటి మెట్టు జాగర్తగా ఎక్కి అందులో రాటుదేలినవాడే రాజకీయాలలో మిగతా మెట్లు అధిరోహించగలడు......అలాంటి వాడే దీర్ఘకాలం ప్రజలలో నిలవగలడు ...... ఆ కార్యకర్త పాత్ర విలువ తెలిసిన వాడే నాయకుడు...... ప్రజానాయకుడు . ఇవ్వాళా ఎంత మంది ఆ కార్యకర్త పాత్ర పోషించి, పార్టీకి సేవలు అందించి పరిపక్వతతో నాయకత్వాన్ని అందుకుంటున్నారు???? పదవులు పొందుతున్నారు??????


పార్టీ ఓడినా, గెలిచినా ఎక్కువగా స్పందించేది కార్యకర్తనే ....కార్యకర్తకి పార్టీ ప్రాణప్రదం ...అంతగా ప్రేమిస్తారు కాబట్టేనేమో, కొన్ని కొన్ని సార్లు ఓటమి బాదలు ఓర్చుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.... అలాంటి కార్యకర్తలను కాపాడుకోవటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే నాయకులు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు..... నేడు ఎంతమంది వున్నారు??? ..బహుశా వేళ్ళమీద లెక్కించ వచ్చు ......


చేతిలో నాలుగు రూపాయలు పెట్టుకుని వచ్చి పార్టీ సిద్ధాంతం తెలియకుండా, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా.... కార్యకర్త చేతిలో వున్న జెండా గుడ్డను కండువగా మెడలో వేసుకుని నాయకుడు అయిపోదామనుకునే వాడు చరిత్రలో నాయకుడిగా నిలిచిన సందర్భాలు చాలా అరుదు.........నేడు దురదృష్టం కొద్ది అలాంటి వారే ఎక్కువ అయిపోతున్నారు .......ఒక్కసారికే తెరమరుగవుతున్నారు ........

ఈ ఎన్నికలలో ఓటమికి ఎవరు భాద్యులు???.....ఏ ఏ అంశాలు ప్రభావితం చేసాయి???......ఆ తప్పులు మనం దిద్దుకోగలమా?? .....అవి మళ్ళీ పునరావృతం అవ్వకుండా మనం జాగర్త పడగలమా???.........

2004 లో ఓటమికి భాద్యతనంతా తన మీద వేసుకుని పార్టీ కోసం చాలా మారారు మన నాయకుడు...... ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజలతో ఎండకు ఎండి వానకు తడిసి 117 రోజులు ప్రజల జీవన ప్రమాణాలను అతి దగ్గరగా చూసిన అనుభవం ఆయనను మరింత మార్చింది......ఇంకా మారటానికి ప్రయత్నిస్తున్నారు ......మరి మిగతా నాయకుల్లో ఎంత మంది ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వాళ్ళ పద్దతులు మార్చుకున్నారు......నిజంగా మార్చుకుని వుంటే పార్టీకి నేటి అపజయం వచ్చేదా????....... అందుకే నేను అంటాను , కాంగ్రెస్ గెలవలేదు ....ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలికతో పాటు కొంత మంది నాయకుల తీరు వల్ల తెలుగుదేశం పార్టీ ఓడింది, అని..... మీలో ఎందరు ఏకీభవిస్తారు???? ......అందరిని ఒకే గాటన కట్టటంలేదు ......చాలా మంది నాయకులు Team Work చేసారు... అందులో కొందరు గెలిచి మంచి ఫలితాన్ని పార్టీకి అందించారు .....కొందరు ఓడారు...అలా ఓడిన వాళ్ళు ధైర్యం కోల్పోకుండా కార్యకర్తలతో వుంటే రేపు అయినా విజయం తప్పక వరిస్తుంది.....అందుకు నిదర్శనంగా నేడు కొంత మంది మన కళ్ళ ముందే వున్నారు ...........

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేని నాయకులు ....కార్యకర్తల అభిప్రాయనికి విలువ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని కార్యకర్తల మీద , పార్టీ మీద రుద్దిన నాయకులు..... ఈర్ష ద్వేషాలతో పక్కనోళ్లకి అవకాశాలు రాకూడదు , వాళ్ళు గెలవకూడదు ,నేనే నాయకుడిగా చలామణి అవ్వాలి ,నేనే అన్ని అనుభవించాలి అనే స్వార్ధ బుద్దితో కుటిల రాజకీయం నడిపిన నాయకులు .... తాము నష్ట పోవటమే కాకుండా పార్టీని నష్ట పరిచారు.....రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుండి విముక్తి చేయుటంలో మన చంద్రన్న సారధ్యంలో కార్యకర్తలు చేసిన పోరాటానికి ప్రయోజనం లేకుండా చేసారు .... కొంత మంది సీనియర్లుగా చెప్పుకుని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న నాయకులను పక్కన పెట్టి పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించండి అని కార్యకర్తలు మొరపెట్టుకునే స్థితి వచ్చింది అంటే ,కార్యకర్తలు ఎంతటి ఆవేదనలో వున్నారో తెలుస్తుంది ....
నా వ్యక్తిగత అభిప్రాయలు / సూచనలు :

1. ప్రజల కోసం పార్టీ చేసే పోరాటాల్లో, ఆ ప్రజల భాగస్వామ్యం ఎంత వరకు వుంటుందో మనం ఆలోచించుకోవాలి ......ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీ కార్యకర్తలు ఎంత పోరాడినా ఫలితం ఆశాజనకంగా వుండదు......మన పోరాటం వారి కోసం చేస్తున్నామన్న నమ్మకాన్ని కలిగించాలి......


2.ఒక మండలంలో కానీ ,ఒక నియోజకవర్గంలో గాని పార్టీ కార్యక్రమం జరుగుతున్నా,పదవులు ఇస్తున్నా అక్కడ వుండే కార్యకర్తల అందరి అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నాము...కార్యకర్తలు అందరికి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాము .......నాయకులు కార్యకర్తలందరిని ఎందుకు కలుపుకుని వెళ్ళలేక పోతున్నారు.....దీనిని మనం ఏ రోజు అయితే మార్చుకుంటామో ఆ రోజు ఆంద్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుతుంది.

3.కొన్ని చోట్ల స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా బయట నుండి తెచ్చిన నాయకులను వారి మీద బలవంతంగా రుద్దటం వల్లన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిని భారీ మూల్యాన్ని చెల్లించుకోవాలిసి వచ్చింది.. మునుముందు ఈ పద్ధతి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి.

4.పార్టీ అనుభంద విభాగాలు పార్టీ విజయానికి ఎంత వరకు కృషి చేసాయి?? ....వాటి వల్ల పార్టీ యొక్క బలం ఎమన్నా పెరిగిందా??.......పదవులు పొందటానికి చూపిన శ్రద్ధ పార్టీ విజయానికి ఎంత వరకు చూపారు??.......5. పార్టీలో వున్న అన్ని స్థాయిల నాయకులకు మానసిక పరమయిన Conselling ఇప్పించి, గ్రూపు రాజాకీయ సంస్కృతి నుంచి బయట పడేసి Team work విలువ చెప్పాలిసిన సమయం ఆసన్నమయినది..........

6.పార్టీని వీడి వెళ్ళిన వాళ్ళను ,కొత్తగా వచ్చేవాల్లను చేర్చుకునే విషయంలో స్థానిక కార్యకర్తలు, నాయకుల అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని వారి ఆమోదం వుంటేనే చేర్చుకుంటే మేలు జరుగుతుంది ....లేదంటే పార్టీ విశ్వసనీయత మరియు పార్టీని అంటిపెట్టుకుని వున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం వుంది..

7.ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా వీలున్నప్పుడల్లా, కార్యకర్తల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు హాజరవ్వటం వల్ల లేదా వారికి వ్యక్తిగత శుభాకాంక్షలు పంపటం వల్ల ప్రజలలో చంద్రబాబు గారి Brand Value మరింత పెరుగుతుంది..కార్యకర్తలలో మరింత ఉత్సాహాన్ని, పోరాటపటిమను పెంచటానికి దోహద పడుతుంది....
8.పార్టీ తరుపున గెలిచిన నాయకులకు Assembly మరియు మీడియా సమావేశాలలో పార్టీ వాణిని వినిపించటానికి SOFT SKILLS మీద training ...వివిధ ప్రభుత్వ శాఖలలో జరిగే లొసుగులను బయటికి తీయుటకు ఆయా శాఖల మీద అవగాహన కల్పించేలా మరియు రోజు వారీ సాధారణ పరిపాలనలో జరిగే తప్పులని ఎత్తి చూపటానికి MLA,MPలకు మరియు పార్టీ నాయకులకు ఎప్పటి కప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించవలిసిన ఆవశ్యకత చాలా వుంది......
9. గ్రామ స్తాయిలో వుండే కార్యకర్తల అందరి బయోడేటాను సేకరించి, పార్టీ తరుపున వారికి సూచనలు సలహాలు ఎప్పటి కప్పుడు నేరుగా అందించే ప్రయత్నం మరింత మెరుగ్గా జరగాలి....
10.ఈ ఎన్నికలలో గెలుపు ఓటముల పైన జరిగే నియోజక వర్గాల సమీక్షా సమావేశాలు NTR Trust Bhavanలో కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ,కార్యకర్తల అందరి నడుమ జరిగితే పార్టీ వాస్తవ పరిస్థితి అధినాయకుడికి తెలుస్తుంది....దానికి తగినట్లుగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునేదానికి మంచి అవకాశం దొరుకుతుంది.....నిజమయినకార్యకర్తల మనోభావాలు పార్టీకి తెలుస్తాయి.....దీనికి కొంత సమయం తీసుకున్న గాని, ఒకసారి చేసి చుస్తే దాని వల్ల వచ్చే ఫలితం ఎంత మెరుగ్గా వుంటుందో తెలుస్తూంది.
మహానాడు నుంచి అయిన ,ఆ మహానుబావుడు చూపిన దారిలో మన నాయకులు అందరు ఐకమత్యంతో ముందుకు సాగుతారని...కార్యకర్తలను వెన్నంటి నడిపిస్తారని,కాంగ్రెస్ దాడుల నుంచి వారికి అండగా వుంటారని .... ఆ పెద్దాయన ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యల మీద, ప్రలోభాలకు లొంగకుండా రాజీ లేని పోరాటం చేస్తారని ....తెలుగుదేశం పార్టీని విజయ శిఖరాల వైపు నడిపిస్తారని ఆశిస్తూ .......
సగటు తెలుగుదేశం కార్యకర్త






Friday, February 20, 2009

ఇంజనీర్లు ఒక ముద్ద అన్నం పుట్టించగలరా?? చిరంజీవి


ఫెబ్రవరి 12 న గుంటూరు జిల్లా ప్రతిపాడులో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి "ఇంజనీర్లు ఒక ముద్ద అన్నం పుట్టించగలరా" అని ఎద్దేవా చేసారు .............ఒక ఇంజనీరు ముద్ద అన్నం పండించలేకపోవచ్చు ....కానీ తన మేధస్సుతో ఆ అన్నం పండించే అన్నదాతకు అండగా నిలవగలడు..తన శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో వ్యవసాయ రంగంలో అద్బుతాలు సృష్టించగలడు. అన్నదాత యొక్క పంట దిగుబడిని పెంచగలడు. క్రిమి కీటకాలు, పురుగుల నుండి అన్నదాత యొక్క పంటను కాపాడగలడు .... అన్నదాతకు వ్యవసాయంలో నూతన పద్దతులు , పండిన పంటకు మార్కెటింగ్ అలాగే పండిన పంటను నిలువ చేసుకొనుటలో తన మేధస్సుతో సహాయపడగలడు ......రాష్ట్రంలో వున్న ఇంజనీర్లలో 90% మంది మధ్య తరగతి వ్యవసాయ కుటుంభాల నుంచి వచ్చిన వాళ్ళే.... ఆ కుటుంభాలు అన్ని ఆ విద్యావంతుల మీద ఆధారపడటంలేదా .......ఒక విద్యావంతుడు అన్నదాతకు ఇన్ని చేయగలడు మరి సినిమా హీరో ఒక మెతుకు అన్నా పుట్టించగాలడా.??????? పోనీ ౩౦ సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో వున్న చిరంజీవి ఆ అన్నదాత కష్టాల మీద ఒక్క సినిమా అన్నా తీసి వారిలో చైతన్యం కలిగించాడా????? ఆ అన్నదాతకు కరువు వచ్చినప్పుడు కాని, వరదల్లో ఉప్పెనల్లో పంట కొట్టుకును పోయి విలవిల లాడుతున్నప్పుడు కానీ కనీసం పలకరించి తన సామాజిక స్పృహను చాటుకున్నాడా ????? .......లేదు..... పోనీ నేడు రాజకీయాల్లోకి వచ్చాక అయిన తన సొంత ప్రాంతం అయిన గోదావరి డెల్టాలో లక్షల ఎకరాలలో రబీ పంట ఎండిపోతుంటే కనీసం ప్రభుత్వం మీద ఆ రైతుల తరపున పోరాడుతున్నాడా?????? వరికి గిట్టుబాటు ధరకోసం ఏనాడు అయిన పెదవి విప్పాడా?????.....సోమశిల జలాలను నెల్లూరు జిల్లా రైతులకు అందకుండా జగన్ స్టీల్ ఫ్యాక్టరీకి తరలిస్తుంటే నోరు మేదిపాడా ??????
లేదు..... లేదు...... లేదు........ లేదు .... కానీ నేడు "యువ"తాంధ్ర స్వశక్తితో ,తల్లి తండ్రుల కష్టార్జితంతో వున్నత విద్యలు అభ్యసించి శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు వాడి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ పటంలో ఎగరేస్తుంటే చూసి మెచ్చుకుని ప్రోత్సహించాలిసింది పోయి, ఇంకా వారినే "ఒక ముద్ద అన్నం పెట్టగలరా" అని అవహేళన చేస్తున్నావే ఇదేనా యువతకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ????....ఇదేనా నువ్వు కోరుకుంటున్న మార్పు ?????.....తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్ఫూర్తితో నేటి మన యువత అన్ని రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతూ మన దేశ ఆర్దికాభివ్రుద్దికి పాటుపడుతుంటే చిరంజీవి గారు ఇంత ఇష్టారాజ్యంగా యువతను అవమాన పరుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ..... ???
లేదు..... లేదు. ఓటే అనే ఆయుధంతో ఈ ఇష్టారాజ్యం గాళ్ళ భరతం పడదాము .....యువతాంధ్ర గుండెచప్పుడు ఈ రక్త వ్యాపారికి తెలిసోచ్చేలా చేద్దాము .

************ మేలుకో యువత -- కాపాడుకో రాష్ట్ర ********************

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?