ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Tuesday, August 26, 2008

పుత్రోత్సాహం విలువ ఎంత ?



వెలుగు(పదవి) వుండగానే ఇల్లు చక్క దిద్దుకోవటం అంటే ఇదేనా?

1) పత్రికా స్తాపనకు

9.9 % వాటాకు 79 % సొమ్ము.
>> పుత్రుడి వాట 61.29 % . పెట్టుబడి పెట్టినది 50 కోట్లు.
>> ఇతర అన్ని సంస్తల వాట 38.71 %, పెట్టుబడి పెట్టినది 305 కోట్లు.
*** ఏమి మేదస్సు ?? ఇది అందరి మెదడకు మేత లాంటిది .

2) రగురాం సిమెంట్ ఫ్యాక్టరీ


>> పెట్టుబడి పెట్టినది 45 కోట్లు . ఒక సంవత్సరం తరువాత దాని విలువ 6500 కోట్లు.
>> పాలనపరం అయిన అనుమతులు, 2000 ఎకరాల సున్నపు గనులు క్షణాలలో అయిపోయినాయి.
>> 7 కోట్లతో డబల్ లేన్ రోడ్ .
>> 3500 కోట్లతో నెల్లూరు జిల్లా సోమసీల ప్రాజెక్ట్ నుండి, రగురాం సిమెంట్ ఫ్యాక్టరీకి నీటి తరలింపు.

**** ఏమి ఈ తండ్రి ప్రేమ ?? ఇందులో కొంచెం అయిన రాష్ట్ర బవిష్యత్తు ఫై వుంటే, మాకు ఈ బాద తప్పేది కదా.

3). ఇడుపులపాయలో - (అప్పటివరకు అనుబవించిన 618 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు పంచుతాము అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో అబివృద్ది చేసుకున్నారు. )


>> 1300 కోట్లతో IIIT నిర్మాణం.
>> 100 కోట్లతో యోగి వేమన కాంపస్ .
>> 8 కోట్లతో ఎకో పార్క్.
>> 29 కోట్లతో ఇడుపులపాయ నుండి యోగి వేమన వర్సిటీకి 4 లేన్ రోడ్.
>> గోల్ఫ్ కోర్సు, ఇతర సుందరికరనలకు 10 కోట్లతో ప్రతిపాదనలు .
>> కడప - బెంగుళూరు వెళ్ళే రైల్వే మార్గాన్ని , ఇడుపులపాయ ద్వార వేల్లెవిదంగా మార్చుకోవటం విశేషం.

**** రాష్ట్రం లో వెనుకబడిన జిల్లాలు కాని , ప్రాంతాలు కాని కనిపించటం లేదా ? మీరు పచ్చగా వుండే సరికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందా ?

4) పులివెందలకి మహా బాగ్యం .
>> 4 సంవత్సరాలలో , 7,185 కోట్లతో ప్రతిపాదనలు .


పక్కనే వున్నా లేక్కిరెడ్డిపల్లె నియోజక వర్గం దుర్బర పరిస్థితిలో వుంది.

*** సొంత నియోజక వర్గాన్ని అబివృద్ది చేసుకోవటం తప్పు అని అనటం లేదు . మిమ్మల్ని నమ్ముకొని రాష్ట్రం అంతా వుంది , అది గుర్తుందా ?

** ఇదేనా దేవుడి పాలన ? అదేమిటో , దేవుడు మీ కుటుంబం అందు వుంచిన అంత దయ , ఈ ప్రజానీకంఫై వుంచటం లేదు .
** ఏమి మేదస్సు??? , 45 కోట్ల పెట్టుబడి, ఒక సంవత్సరం లో దాని విలువ 6500 కోట్లు . మీ పుత్రుడి చే ISB(ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ ) లో క్లాసులు నిర్వహిస్తే, ఈ దేశానికి ఎంత మంది ఆర్దిక వేత్తలని తయారు చేయవచ్చో .

** మీ పుత్రుడిని వ్యాపారులు చేయకూడదు అని అనటం లేదు. అది అందరి హక్కు . ఇంత త్వరగా ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదిన్చినారో చెప్తే, మేము కూడా నేర్చుకుంటాము . దయచేసి మా తండ్రులని ముఖ్యమంత్రి అవమని మాత్రం చెప్పకండి .


ఏమిటి యువత తక్షణ కర్తవ్యము ?

రోజుకొక పధకం పెడుతూ , ప్రజలని మభ్య పెడుతూ , ఈ ప్రభుత్వం చేస్తున్న స్వార్ద పాలనను ప్రజల ముందు వుంచవలసిన తరుణం ఇది. బావి పౌరుల బంగారు బవిష్యత్తు కొరకు యువత ఆలోచించవలసిన తరుణం ఇది.

ఇట్లు,

యువ ఇంజనీర్స్
manakosamtelugudesam@gmail.com



No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?