ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Friday, August 8, 2008

ఇదేనా ప్రజా పాలనా ??

నాలుగు సంవత్సరాలలో ఇడుపలపాయలో ఏమి జరిగినది??

1. కడప బ్రహ్మిని స్టీల్స్ లో విమాన ఆశ్రయం కోసం 4000 ఎకరాల భుమి ఇచ్చినారు.

2. హైదరాబాద్ ఇంటర్నేషనల్ విమానశ్రేయానికి కి ఇచ్చినది 5400 ఎకరాలు . కడప లో ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి ఇచ్చినది కూడా ఇదు వేల ఎకరాలు.

3. రెండు వందల కోట్లతో కడప నుండి పులివెందులకు 4 లేన్ రహదారి. కడప వాసులు సైతం విస్మయం చెందుతున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒక్క వాహనం కూడా వెల్లదు . దానికి, ఇంత రోడ్డు అవసరమా అని ?
ఈ రహదారిపై కడపలో ఒక జోక్ నానుతుంది : మా ముఖ్యమంత్రి , పంటలు ఆర పెట్టుకొనుటకు , రెండు వందల కోట్లతో ఈ 4 లేన్ రహదారి వేయించినారు అని .

4. రాష్ట్ర ముఖ్యమంత్రిగా , పలుకుబడి చూపించి ఇదు వేల కోట్ల ఖరీదు చేసే రైల్వే లైన్ తెచ్చుకున్నారు. అదే ఎప్పటినుండో తెలంగాణా ప్రజలు ఎదురు చూస్తున్న కరీంనగర్ - పెదపల్లి రైల్వే లైన్ కి 200 కోట్లు తీసుకోని రాలేకపోయినారు.

5. ఇడుపలపాయ ( మన ముఖ్యమంత్రి సొంత ఎస్టేట్ ) లో గోల్ఫ్ కోర్ట్ ( గోల్ఫ్ కోసం ప్లే గ్రౌండ్ ) .

6. ఇడుపులపాయ లో ఫార్ములా 1 రేసింగ్ కోర్సు . కావలసిన వసతులు అన్ని ప్రభుత్వము సమకూరుస్తుంది అట. పుత్రుడు ఇస్టపడితే ఎమైన చేస్తాడు ఈ తండ్రి . కావలి అంటే రాష్ట్రాన్ని రాసి ఇస్తాడు.

7. కడప లో టెక్స్ టైల్ పార్క్ . చేనేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల , పోచమ్మపల్లి లో ఒక్క టెక్స్ టైల్ పార్కు కూడా లేదు.

8.కొడుకు కోసం బ్రహ్మని స్టీల్ ప్లాంట్. దీనిలో పెట్టుబడి పెట్టటానికి, వేల కోట్లు ఇంత త్వరగా ఎలా సంపాదిన్చినారో , ఆ దేవుడికే తెలియాలి (దేవుడి పాలన కదా! )

9. మళ్లీ పుత్రుడి కోసం రగురాం సిమెంట్ ఫ్యాక్టరీ .

10. బాసర లో విమానాశ్రయం లేదు అని కారణం చూపి , రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం IIT ని మెదక్ కి మార్చినారు. కడపలో సొంత స్టీల్ ఫాక్టరీ ( బ్రహ్మని స్టీల్ ) కోసం , నాలుగు వేల ఎకరాలలో విమానాశ్రయం నిర్మించటానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం , అదే బాసరాలో , విమనాశ్రేయానికి కుంటి సాకులు చెప్పుతుంది.


ఏమిటీ ఈ పాలన, మళ్లీ పదవిలోకి రాము అని తెలిసి చేస్తున్నారా ?? ( వెలుగు వున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అని పెద్దలు చెప్పినది ఆచరించి చూపిస్తున్నారు ).

ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన తరుణం ఇది. తొమ్మిది సంవత్సరాల పాలనలో , ఆర్దిక సంస్కరణలు అమలు పరచి, సంపదను సృష్టిస్తే , సంస్కరణ పలితాలు పేదలకు అందవలసిన తరుణంలో ఇలా స్వార్ద పరుల చేతిలో ప్రభుత్వ పాలన ఉండటం బాదాకరం.


రండి ...........తరలి రండి........రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము.

1 comment:

H A R I said...

Everybody has to observe one thing here -- The congress is using the NTR name and his innovative ideas like Rs 2 /- per KG rice and also his way of dialogue delivery in the public meetings as well. Even the new party also taking NTR as inspiration.

This implies that for every party, TDP is the basic inspiration for begging the public. So if TDP comes back into the power, I think all other parties can't think of survive in the state. And when it comes to new parties like NTPP etc... they have to feel shame to show their faces to the public aa they can't go back to their old firms like TDP for Goud and cine industry for chimpanji.

So guys, the time starts now to let every body wake up and get back our golden days.

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?