ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Monday, August 11, 2008

సమాజ సేవలో తెలుగుదేశం - ఎన్.టి.ర్ ట్రస్ట్

రాజకీయ పార్టీ కార్యకర్తలను, సమాజ సేవ వైపు నడిపించిన ఎకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం.

అత్యదిక రక్త దాతలు చే రక్తం అందుకున్న బ్లడ్ బ్యాంకు గా, ప్రభుత్వం చే గుర్తింపు పొంది, అవార్డు పొందిన ఒకే ఒక్క ట్రస్టు - ఎన్.టి.ర్ ట్రస్ట్.
దీని నుండి ఇతరులు నేర్చుకోవలిసినది : ఆర్బాటం కన్నా ఆచరణలో చేసి చూపటం.

* ప్రతి మనిషి కి ఆరోగ్యకరమైన జీవితం, విద్య , ఆర్దిక స్వాతంత్యం అందిచాలి అనే సంకల్పం తో ఏర్పడి, ఎంతో మందికి అండగా నిలబడినదే - ఎన్.టి.ర్ .ట్రస్ట్

* ప్రకృతి విలయ తాండం చేసిన ప్రతిసారి, రాజకీయాలకు అతీతంగా , మీకు మేము వున్నమంటూ ముందుకు వచ్చేది - ఎన్.టి.ర్ ట్రస్ట్

* ఒక మనిషి ఆరోగ్యంగా వున్నప్పుడే , తన హక్కులని కాపడుకోగలడు అని సూక్తితో , ఎన్.టి.ర్ ట్రస్ట్ పలు విదములైన వైధ్య శిబిరములు నడుపుతుంది.

1. గ్రామీణ మరియు పేద ప్రజల అవసరాలు వైధ్య అవసరాలు తీర్చుటకు , అందుబాటులో ఉంచుటకు , కదిలే వైధ్య శిబిరములు (మొబైల్ క్లినిక్స్) ఏర్పాటు చేసినది.

>> ప్రతి మొబైల్ క్లినిక్ , నెలకి 48 గ్రామాలని చుట్టి వస్తుంది.

>> ఆరోగ్య పరిక్ష (హెల్త్ చేకప్ ) లతో పాటు, ప్రాదమికంగా అవసరమైన మందులను ఉచితంగా ఇస్తుంది .
>> హాస్పిటల్స్ లో చికత్స అవసరమైన అప్పుడు, కొన్ని ప్రత్యేక హాస్పిటల్స్ లలో రాయితీ ఇప్పిస్తుంది.
>> గ్రామీణ ప్రజలకు , ఆరోగ్యం ఫై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది.
>> ప్రకృతి వైపరిత్యాలు సంబవించినప్పుడు , అంటు వ్యాదులు సోకకుండా ముందు వుండి తన సేవలు అందిస్తుంది.

>> అత్యవసర సమయాలలో రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, రక్త దాన శిబిరములు నడుపుతున్నది.

2. మారుమూల గ్రామాలలో నేత్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది.

>> గ్రామీణ విద్యార్ధులు చూపు లోపంవల్ల , చదువుకు దూరం అవుతున్నారు అని గ్రహించి, అవసరం అయిన మందులు, కంటి అద్దాలు (గ్లాసెస్) ఉచితంగా అందిస్తున్నది.
>> గ్రామాలలో నేత్ర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి, నేత్ర పరిక్షలు నిర్వహిస్తుంది. అవసరం అయిన వాళ్ళకి ఉచితంగా మందులు , అద్దాలు ఇస్తుంది.

3. తల్లి మరియు బిడ్డ సంరక్షణ పేరుతో, వైధ్య సేవలు అందిస్తున్న ఎకైక ట్రస్ట్

>> ప్రసవం సమయంలలో , సరి అయిన వైధ్య సదుపాయం లేక మరణిస్తున్న మహిళలలో , మన రాష్ట్ర గ్రామీణ మహిళలే ఎక్కువ అని గ్రహించి , వైధ్య సదుపాయాలు అందిస్తున్నది ఎన్.టి.ర్ ట్రస్ట్.
>> ఈ అవకాశం మొదటగా రెండు జిల్లాలో ప్రారంభించటం జరిగినది. దీని ముఖ్య ఆవశ్యకత -
>> ప్రసవం సమయంలో కావలసిన వైధ్య సదుపాయాలు అందించటం.

>> ప్రసవం కి ముందు, తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలూ తెలియజేయటం.
>> తల్లి తండ్రులనుండి , పిల్లలకి సోకే HIV అంటి వ్యాధుల నుండి కాపాడటం.
>> ఎయిడ్స్, మరియు ప్రాధమిక వైధ్య అవసరలపై అవగాహనా సదసులు నిర్వహించటం.

4. విధ్యని అబ్యసించటం ప్రతి వ్యక్తీ ప్రాదమిక హక్కు అని నమ్మి, అనాదలకు , పేద విధ్యార్దులకు , మారుమూల గ్రామీణ విధ్యార్దులకు , విధ్యని అందించాలి అనే లక్ష్యం తో విధ్యా పధకంను నడుపుతుంది.


>> ఎన్.టి.ర్ మోడల్ స్కూల్ ని స్థాపించి, పేద విధ్యార్దులకు ఉచితంగా, కొంతమందికి రాయితీలపై , మంచి విద్య అందిస్తుంది.


5. గ్రామీణ అబివృద్ది పధకం


>> గ్రామీణ యువతకి ఉపాది అవకాశాలు అందించటం కోసం, పలు శిక్షిణ కేంద్రాలు నడుపుతున్నది.

>> సెక్యూరిటీ గార్డు ట్రైనింగ్ పధకం.
>> కంప్యూటర్ ట్రైనింగ్ పధకం.
>> డ్రెస్ డిజైన్ మరియు టైలరింగ్ .
>> మెషిన్ ఏమ్ బ్రోయెడరి (Embroidery).
>> చేతి ఏమ్ బ్రోయెడరి .
>> ఫాబ్రిక్ పేయిటింగ్ ...మొదలగు శిక్షిణ కేంద్రాలు నడుపుతుంది.

ప్రభుత్వం సైతం పటించుకొని ఎన్నో పనులు, ఎన్.టి.ర్ ట్రస్ట్ చేసి , ప్రభుత్వం కళ్లు తెరిపించినది.

>> ఉదాహరణ : సంక్షేమ హాస్టల్లో , దోమల బాద , చలి కాలంలో చలి బరించ లేక, విద్యార్దులు అవస్తలు పడుతుంటే , కొన్ని లక్షల దుప్పట్లు పంచి ప్రభుత్వాన్ని సైతం విస్మయం పరిచినది.

** ఎన్.టి.ర్ ట్రస్ట్ ద్వార , " చెప్పటం కన్నా చేయటం మిన్న" అన్న సూక్తి ఆచరించి చూపిస్తున్నది - మన తెలుగుదేశం .


** ఎలేక్షన్స్ వచినప్పుడు తప్ప , రాజకీయాలు మట్లాడను అన్నా పాలకుడు కావాలా (లేక) ప్రతి నిమిషం రాజికీయ ఎత్తుగడలతో పాలించే పాలకుడు కావాలో ఆలోచించుకోవలసిన తరుణం ఇది.

** సమాజ సేవ కొరకు మేము అంటు , రాక ముందే రాజకీయ ఎత్తుగడలు నడిపే వ్యక్తులు కావాలో , సమాజ సేవ కోసం, బావి పౌరుల బంగారు బవిషత్తు కోసం ఆలోచించే వ్యక్తులు కావాలో నిర్నయించుకోవలసిన సమయం ఆసన్నమయినది .

రండి ...........తరలి రండి........రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము.

No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?