ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Friday, August 8, 2008

చదువుల తల్లిని సైతం మోసం చేసినారు !!!!

1. బాసరలో IIT ని నెలకొల్పుటకు గత తెలుగుదేశం ప్రభుత్వము పాలన పరమైన అనుమతులు అన్నీ భారత ప్రభుత్వము నుండి స్వీకరించి, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదింప చేసినది. గత NDA ప్రభుత్వము బాసరలో IIT ఏర్పాటుకు అనుమతి కూడా ఇచ్చినది .

2.ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ,బాసరలో మౌలిక వసతులు లేవు అని చెప్పి , సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, IIT ని మెదక్ కు తరలించినారు.

3. అభివృది అనేది రాష్ట్రము లోని అన్ని మారుమూల ప్రాంతాలకు విస్తరించాలి. బాసరలో IIT ని నెలకొల్పటం వల్ల , హైదరాబాద్ నుండి బాసర వరకు వున్నా 250 కిలోమీటర్స్ చాల అబివృద్ది చెంది వుండేది.

4. బాసరలో IIT ఏర్పాటు చేసి వుంటే, హైదరాబాద్ నుండి బాసరకు 4 లేన్ రహాదారి ,
డబల్ లైన్ రైల్వే ట్రాక్ వచ్చి వుండేది. విమానాశ్రయం కూడా నిర్మించుకొనే అవకాశం వుండేది. దీని వల్ల, గిరిజన ప్రాంతం అయిన ఆదిలాబాద్ తో పాటు, తెలంగాణా కూడా ఎంతో అబివృద్ది చెంది వుండేది.

5.బాసర విమానాశ్రయం లేదు అని కుంటి సాకులు చూపించి, బాసరకు IIT రాకుండా అడ్డుకున్నారు . ఇదే ప్రభుత్వం , కడపలో సొంత స్టీల్ ఫాక్టరీ ( బ్రహ్మని స్టీల్ ) కోసం , నాలుగు వేల ఎకరాలలో విమానాశ్రయం నిర్మించటానికి అనుమతి ఇచ్చినది.

6. బాసరలో IIT ని నెలకొల్పటం వల్ల, సరస్వతి దేవి నిలయమైన బాసరకి ప్రపంచస్థాయిలో గుర్తింపుతో వచ్చి, టూరిజం అబివ్రుద్దితో పాటు, ఆ ప్రాంత ప్రజల జీవన విధానం , నాగరికత ప్రపంచానికి తెలిసేది. మరియు, ఆ ప్రాంతలో వర్తక వాణిజ్య రంగాలకు నూతన అవకాశాలు వచ్చి వుండేవి.

7. చదువుల తల్లి సరస్వతి వుండటం వల్ల బాసరకి , ఒక అరుదైన గుర్తింపు వున్నది. IIT స్థాపన వల్ల , ఆ గుర్తింపు దేశ ప్రజల అందరికి తెలియటమే కాక, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగేది . మరియు, హిందూ సంస్కృతీ అబివృద్దికి మరింత ఉపయోగ పడేది.


దేవుడి పాలన అని చెప్పి, దేవుడిని సైతం ఇలా మోసం చేసినారు. ఇదేనా , మీ నిస్వార్ద పాలన??మీ అవసరాల కోసం, స్వార్ద పాలన చేస్తూ, ప్రాంతాల మద్య బెదాభిప్రాయాలు పెంచినారు. ప్రపంచమంత ముందుకి పోతుంటే, కులాల మద్య, ప్రాంతాల మద్య బెదాభిప్రాయాలు పెంచి, అబివ్రుద్దిలో రాష్ట్రాన్ని వెన్నక్కి నడుపుతున్నారు.

2 comments:

Anonymous said...

Yesterday tv9 telecasted a programme on Hyderabad's situation. People are really scaring on coming to Hyderabad. Earlier it's a dream of common man.
Even Tirupati also, intellegence warned that tirumal is no more safe. They had given TIRUMALA maintenance power to other communities. Ultimately it got affected.
People in other states are laugh at ANDHRAites, on defeating BABU.
Any how guys.. good attempt. Keep it up. Let's hope that, atleast this time people will prove their power by electing BABU. Telugu people should act to eliminate the saying ANDHRULU GORRELU.

Anonymous said...

Thalli palu thagi rommu guddhe luchalu vunna ee rojullo, anni rakaluga settle ayyi happy life enjaoy chestu kuda meeru ee position ki ravataniki way choopina "CHANDRA BABU" kosam meeru chestunna yagnam really hats off. Go a head brothers. Mee lanti vallu mundu vundandi we will follow u.

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?