ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Thursday, September 11, 2008

ఆంధ్రలో అయిదువేల కోట్ల రూపాయల భూ కుంభకోణం

స్థలాల ఎరతో రాజ్యాంగ వ్యవస్థలను లోబరుచుకునేందుకు పాలకుల పన్నాగాలు

ప్రజలు, చట్టసభలు, అధికార యంత్రాంగం, మీడియా .... ఇలా ఏ ఒక్కో వర్గాన్నీ లెక్కచేయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టు పై విరుచుకుపడి న్యాయమూర్తిపైనే సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలిసిందే.అదే కాకుండా రాష్ట్ర రాజధాని నగరంలో భారీ భూ కుంభకోణం జరుగుతుంది.రాష్ట్ర ప్రభుత్వ పాలకులు వారి స్వీయ ప్రయోజనాలను ఆశించి నచ్చిన వారికి కోట్ల రూపాయల భూములను కేటాయిస్తుంది.తరువాత తమ మనుషులకు చెందేలా పావులు కదుపుతోంది.

ఈ కోవలో తాజాగా మరో అంకానికి తెరతీశారు.తమ అస్తవ్యస్త విధానాలను ప్రశ్నించకుండా ఎమ్మెల్యేలకు, చెప్పిన పని చెప్పిన విధంగా చేసేందుకు గాను అధికార యంత్రాంగానికీ,వీటిని బయటపెట్టకుండా మీడియాకు, హైకోర్టులో వున్న కేసుల విషయంలో ప్రభావం చూపేందుకు న్యాయమూర్తులకు ప్రభుత్వం స్థలాలను ఎరగా వేసింది.ఓ పక్క రాజధానిలో లక్షలాది మంది రోడ్లపైనా , ఫుట్ ఫుటపాత్ లపైనా బతుకుతుంటే ... మరోపక్క నెలకు ఆయిదంకెల జీతాలను పొందుతున్న వారికి కోట్ల రూపాయల విలువైన స్థలాలను నామమాత్ర ధరలకు కట్టబెడుతుంది. జ్యుడిషియరి, లెజిస్లేచర్ ,ఎగ్జిక్యూటివ్,మీడియా ..ఈ నాలుగు ఎస్టేట్ల వారికీ వందల కోట్ల రూపాయల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం మార్చి 17వ తేదిన కేబినేట్ సమావేశంలో తీర్మానించింది. అన్ని పత్రికలూ కేబినేట్ సమావేశం వార్తను ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయాన్ని రాయలేదు. ఒక్క టెలివిజన్ ఛానల్ కూడా ఆ విషయాన్ని ప్రసారం చెయ్యలేదు.దీన్ని బట్టి ప్రభుత్వ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.

పాత్రికేయులకు కేటాయించిన 70ఎకరాల భూమి విలువ సుమారు వెయ్యికోట్లు.ఇందులో 300 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తున్నారు.ఈ ఒక్కో ప్లాటు విలువ కనీసం 70 లక్షలు.అలానే ఒక్కో జడ్జీకి కేటాయిస్తున్న ప్లాటు విలువ రెండు కోట్లు.ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు,అయ్యేఎస్ ,ఐపీఎస్ అధికారులకు ఇస్తున్న ప్లాట్ల విలువ కొటి రూపాయల పైమాటే.దీంట్లో తనకు నచ్చిన వారికి ప్లాట్లు వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం అయ్యేఎస్,ఐపీఎస్ అధికారులను పెద్ద సంఖ్యలో బదిలీ చేసింది.కేంద్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా లెక్క చేయక పాత తేదీలతో జీవో జారీ చేసారు.

ఇలానే 2005లోను కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనం పేరుతో రాజ్యంగా వ్యవస్థలకు ఎరగా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అప్పటి హైకోర్టు జస్టీస్ శ్రీ సింఘ్వి అడ్డుకున్నారు.ఆయన సుప్రీం కోర్టుకు బదిలీ అయ్యే వరకూ ఆగిన రాష్ట్ర ప్రభుత్వం తరువాత ఆ ప్రక్రియను వేగవంతం చేసింది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ సింఘ్వి(08.10.2007) ఇచ్చిన తీర్పు ప్రకారం వ్యక్తిగతమైనా సరే ఇప్పటికే ఎవరికయినా వారి లేదా భార్య పిల్లల్లో ఎవరి పేరునైన ఇల్లు/స్థలం వుంటే వారికి ప్రభుత్వ స్థలం ఇవ్వవద్దని చెప్పారు .ఇప్పుడు సొసైటీ సభ్యత్వాలున్న వారిలో కొందరికి వారి సొంత/భార్య/పిల్లల పేర్లపై స్థలాలు,ఇల్లు వున్నాయి.ఇలాంటి వారికి కూడా కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇవ్వనున్నారు.అంతేకాకుండా ఆ తీర్పు ప్రకారం అవుటర్ రింగురోడ్డు పరిధిలో ఏ సొసైటీకికానీ,వ్యక్తులకు కనీ స్థలాలు కేటాయించవద్దని స్పష్టంగా ఆదేశించింది.భవిష్యత్ సమాజ అవసరాలు,సంక్షేమం దృష్ట్యా చీఫ్ జస్టిస్ చెప్పిన ఆ విషయాన్ని తుంగలో తొక్కారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు,అక్రమాలపై మా రాష్ట్రంలోని ప్రధాన పత్రికలన్నిటిలోనూ ప్రతి రోజూ బ్యానర్ కధనాలు వచ్చేవి .పదుల సంఖ్యలో కేసులు హైకోర్టులో విచారణలో వున్నాయి.వచ్చే సంవత్సరం సాధారణ ఎన్నికలు జరుగుతాయి.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలు మూడింటినీ తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.అందులో భాగమే కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ఖరీదైన స్థలాల పందేరం.పనిలో పనిగా స్థలాలు అప్పగించిన సోసైటీల్లో తన వారిని ప్రవేసపెట్టి బినామీ పేర్లతో ముఖ్యమంత్రి,ఆయన సన్నిహిత సహచరులు స్థలాలను తీసుకుంటున్నారు.హైకోర్టు జడ్జీలు కూడా లబ్దిదారులుగా వున్న ఈ స్థలాల వ్యవహారాన్ని అదే జడ్జీలు విచారించబోతున్నారు.పాత్రికేయుల సొసైటీ (జవవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యుచివల్లీ ఎఇడేడ్ కో ఆపరేటివే సొసైటీ లిమిటెడ్ )లో 1050 మంది సభ్యులలో 125 మంది బినామీలే! దీనిపై హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం,మరికొన్ని ఇతర కేసులను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారు.ముఖ్యమంత్రి ఇటీవలే ఒక దిన పత్రికను ప్రారంభించారు.ఇప్పుడు లబ్ది పొందుతున్న వారిలో ఆయన పత్రికలో పనిచేస్తున్న అనర్హులయిన జర్నలిస్టులు పదుల మంది వున్నారు.ఇలా స్థలాలు ఇప్పిస్తామన్న హామీతోనే వారిని ఇతర సంస్థల నుంచి తన పత్రికకు వచ్చేలా ముఖ్యమంత్రి ఆకర్షించారు.


ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ స్థంభించిపోవటం ఖాయం.ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్, హైకోర్ట్ వివధ సందర్బాలలో తూర్పరపట్టాయి.వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని ఎత్తి చూపాయి.వాటిపై చర్యలు తీసుకోమన్న ఒత్తిడి రాకుండా ఇప్పుడీ స్థల పందేరాన్ని సాగిస్తుంది.మీరు తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రభుత్వ చర్యలతో రాష్ట్రం అల్లకల్లోలమయ్యే పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

ఇట్లు,
--- సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న జర్నలిస్టులు
manakosamtelugudesam@gmail.com

No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?