తాకట్టు లో ఉన్నతెలుగు ఆత్మగౌరవం , స్వరాజ్యం వచ్చినా రాని 'సు'రాజ్యం, మద్రాసి అనే మాయని మచ్చ,జవసత్త్వాలు ఉడిగిన జాతి , పొరలు గ పేరుకుపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ , జవాబుదారి తనం లేని జమానా , కనీస వసతులు లేని కోట్లాది జనాభా పాతికేళ్ళ కిందట ' తెలుగుదేశం' ఆవిర్భావానికి కారణాలు అయ్యాయి.
జనం గుండె గుడి లో కొలువున్న దేవుడు , తెలుగు వారి రాముడు ,కృష్ణుడు ఐన నందమూరితారక రాముడు సామాజిక అసమానతలని రూపు మాపి , తెలుగు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఉద్దేశ్యం తో 'తెలుగుదేశం ' పార్టీ ని స్థాపించారు.
తొమ్మిది నెలల్లో అధికారానికి వచ్చిన తెలుగుదేశం పారదర్శకత , నిజాయతి , సామాజిక బాధ్యత తో కూడిన నూతన రాజకీయాలని తెలుగు వారి ముందు ఆవిష్కరించింది .సుమారు రెండు వందల విద్యావంతులకి శాసన సభ లో ప్రవేశం కల్పించింది.
'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు' అనే ధర్మ వాక్యం పాటించి పలు సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కి ఊపిరి పోసారు ఎన్టీ రామారావు గారు.మహిళ ల కి ఆస్థి లో సమాన హక్కు ,విద్య ఉద్యోగాల్లో ౩౩% అవకాశాలు , కుట్టు వంటి వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ , జీవన భద్రత , మహిళా విశ్వ విద్యాలయ స్థాపన , మండల పాలనా వ్యవస్థ , మెరుగైన రవాణా సౌకర్యాలు , రక్షిత మంచి నీటి పధకాలు, సింగిల్విండో పధకం ద్వారా రైతులకి రుణాలు,ప్రకృతి వైపరీత్యాల సమయం లో రుణ మాఫీలు ,ఉచితం గ పక్కా ఇళ్ళ నిర్మాణం , రెండు రూపాయలకే కిలో బియ్యం , రైతన్న లకి ఉచిత విద్యుత్ .మద్యపాన నిషేధం , జోగినీ దురాచార నిర్మూలన, గరిష్ట భూపరిమితి చట్టం , పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు , వెట్టి చాకిరీ నిషేధం ,అవినీతి లేని అధికార వ్యవస్థ ,స్వయంప్రతిపత్తి గల స్థానిక వ్యవస్థ , రాయలసీమ కి తెలుగు గంగ ద్వారా జలాలు ,సాగు తాగు నీటి వసతుల కల్పన, సత్వర న్యాయం కోసం లోకాయుక్త ఏర్పాటు ,ఉన్నత విద్యా ప్రవేశపరీక్షలు ,విద్యారంగం లో ఫీజు రద్దు, వైద్య , తెలుగు విశ్వ విద్యాలయాల ఏర్పాటు , నేత వృత్తుల వారికీ ఆప్కోద్వారా భద్రత , సంస్కృతీ పరిరక్షణ కోసం టాంక్ బండ్ పై తెలుగు వెలుగుల విగ్రహాల ఏర్పాటు, నక్సలిజం నిర్మూలన,మత కల్లోలాల అణిచివేత , శాంతి భద్రతల రక్షణ వంటి పలు కార్యక్రమాల ద్వారా ఇంటింటిధైవం గ నీరాజనాలు అందుకున్నారు .అన్న గా ఆడపడుచుల గుండెల్లో నిలిచిపోయారు నందమూరి .ఢిల్లీ పెద్దల కళ్లు బైర్లు కమ్మేలా తెలుగు ఆత్మ గౌరవపతాకాన్ని విను వీధుల్లో ఎగరవేశారు ఎన్టీయార్ .
అయన వారసుని గ అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు,అభివృద్ది ని క్రొత్త పుంతలు తొక్కించి దార్శనికత తో ఆర్థిక, విద్యుత్ సంస్కరణలు చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశం లో నే అగ్రగామి గా గనిలబెట్టారు.
ఈ -సేవ, జన్మభూమి, ప్రజల వద్దకి పాలన, హై-టెక్ విధానాలు, పరిణతి చెందిన రాజకీయాలు, మహిళ ల కోసం డ్వాక్రా పధకాలు, సాంకేతిక విద్యా విప్లవం, పారిశ్రామిక అభివృద్ది , సాగు నీటి సంస్కరణలు, పాలన లో ప్రజా భాగస్వామ్యం , నోడల్ వ్యవస్థ , బలమైన స్థానిక పాలన వ్యవస్థ లాంటి ఎన్నో పధకాల ద్వారా దేశం అంతా మన రాష్ట్రాన్ని ఆదర్శం గ తీసుకునేలా చేసారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు .
కాని ప్రకృతి వైపరీత్యాల వల్ల , కాలం కలిసి రాక గత ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయం పాలయ్యింది .
కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రాష్ట్రము రావణ కాష్టమే అయ్యింది.
నేడు జన్మభూమి పరిస్తితి ...
>> దిగజారిన జీవన ప్రమణాలు ,నీరు గారిన నీటి ప్రాజెక్టులు( ఒక్క వరద కే గండ్లు పడ్డ ప్రాజెక్టులు ఎన్నో .. ),
>> హద్దుల్లేని హత్యారాజకీయాలు(సుమారు రెండు వందల తెలుగు దేశం కార్యకర్తల హత్య),
>> కొల్లలు గా కుంభకోణాలు (వోల్క్స్ వాగన్ ,డిపెప్, బ్రహ్మిని స్టీల్స్ కి భూమి ,పద్మాలయ స్టూడియోస్ ఉచితం గ భూమి లాంటివి ఎన్నో..),
>> పత్రిక స్వేఛ్చ మీద ప్రత్యక్ష దాడులు (ఈనాడు, ఆంధ్రజ్యోతి ల మీద కేసులు),
>> చుక్కల్లో చిక్కి దిగి రాని ధరలు( గత ఆరు మాసాల జన జీవనం పీడకల) ,
>> రామరాజ్యం స్థానం లో 'బల భీమ ' రాజ్యము,
>> దేహి దేహి అంటు ఢిల్లీ వీధుల్లో దేబిరించే స్థితి(సోనియా చెప్పకుండా చీమ కూడా కుట్టదు),
>> కుల మత ప్రాంత విద్వేషాలు అన్ని కలిసి ఓటు వేసి చేసిన పొరపాటు ని వెక్కిరిస్తున్నాయి..
>> ఒక్కసారి మళ్లీ రాష్ట్రము ౩ దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోయింది.కుంటుపడ్డ అభివృద్ది కుంటుతూ నడుస్తుంది.
భావి తరాలకి మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించాలి.ఇందుకు యువత నడుము కట్టాలి ,నిద్ర మత్తు వీడి నిప్పులు చెరగాలి.
రామరాజ్యం మళ్ళీ సాధించి మన రామన్న ఆత్మకి శాంతి చేకూరుద్దాము.
రండి ...తరలి రండి ...రాబోయే తరాలకు బంగారు బాటను వేద్దాము .
ఇట్లు,
యువ ఇంజనీర్స్ ,
ఆర్టికల్ - శ్రీనివాస్
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment