పొత్తుల వల్ల నష్టపోయాము అని అంటున్నారు.. నిజమే, కానీ.. ఇప్పుడొచ్చిన నష్టం తాత్కాలికం.. నిజం.
అదే ఆరోజు పొత్తులు లేకుండా వెళ్ళినట్లయితే, కూటమిలోని మిగతా పార్టీలు కచ్చితంగా చిరు చెంతన చేరేవి. అప్పుడు ఎంత లేదన్నా యాభైకి పైగా సీట్లు వాళ్ళు సాధించేవారు. ఆ పరిస్థితుల్లో మనకైనా, కాంగ్రెస్ వాళ్ళకైనా వారి మద్దతు అవసరం వచ్చేది. ఫలితంగా అయిదేళ్ళు చిరంజీవి కీలకమయ్యి తిరుగులేని బలాన్ని తన పార్టీకి కూడగట్టుకునేవాడు. అలా వచ్చే నష్టం శాశ్వతం. ఇప్పుడు ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారు, రాష్ట్రాన్ని ఏలే సత్తా ఎవెరేవరికి ఉందో మనకి సొంతంగా తొంభైకి పైగా స్థానాల్ని ఇచ్చి చాలా స్పష్టంగా చెప్పారు. తెరాస, వామపక్షాలు మరియు పిఆర్పీల స్థాయి ఎంతో చాలా బాగా చెప్పారు.
కాకపోతే కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యాలకు మన కార్యకర్తను ఇప్పుడు మరొక అయిదేళ్ళు బలిచెయ్యాలి. కాదు, కాకూడదు!!. మన బలం బలగం రెండూ పెరిగాయి అసెంబ్లీలో. మనకార్యకర్త రక్షణ కోసం సర్వశక్తులూ ఒడ్డాలి. ఇంకా ఇంకా మెరుగైన వ్యవస్థను నెలకొల్పి, స్థానిక నేతను ప్రతి కార్యకర్తకు చేరువ చెయ్యాలి. వాళ్ళకే కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక నాయకుడు ఉండేలా చూడాలి.లోక్ సత్తా వల్ల జరిగిన అనర్ధం ఏంటో స్పష్టంగా తెలిసింది.. మన పరాజయానికి ఇంకొకరిని భాద్యత వహించమనడం నిజమైన వ్యక్తిత్వం అనిపించుకోదని నాకూ తెలుసు.. కానీ మనం చాలా చోట్ల పరాజయం చెందలేదు. ఏకంగా ఇరవైనాలుగు సీట్లు లోక్ సత్తా క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయామని మీడియా అంతా కోడై కూసింది.. వందలో అరవైమంది మంచి నలభైమంది చెడ్డ అనుకుంటే, ఆ అరవైలో పాతికమంది మేము అతిమంచి వాళ్ళమని అతిగా ఆలోచించి, మేము ఎవరితోను కలవము అని విడిపోతే, మిగిలిన ముప్పైఅయిదు మంది మంచివాళ్ళు నలభైమంది చెడ్డవాళ్ళముందు పరాజితులుగా నిలిచారు.. ప్రజలు గెలిచారు అని చెప్పుకుంటున్న వీళ్ళు, నిజానికి ప్రజాతీర్పుని ఓడించారు. అర్హత లేనివాళ్ళకి సింహాసనం కట్టబెట్టి చారిత్రక తప్పిదం చేసారు. మీడియా ముందు కూర్చొని వినసొంపైన నీతులు వల్లించే వీళ్ళు, వారి చేష్టల వల్ల ప్రజలకి జరిగిన నష్టమెంతో గ్రహిస్తే మంచిది.
ఇక చిరు గురుంచి ఎంతచెప్పినా తక్కువే, ఏమిచెప్పినా ఎక్కువే..!! పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు.. ఏకంగా ఎన్టీఆర్ తో పోల్చేసుకుని, ప్రజలే వచ్చేయ్యమన్నారు అని గాలికూతలు కూస్తూ అభిమానుల మానాభిమానాన్ని పణంగా పెట్టి నమ్ముకున్నోళ్ళ దగ్గరనుంచి కోట్లు కొల్లగొట్టి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో తన స్థాయి స్థానం ఏంటో చవిచూసాడు. దేశం ఎమనుకుంటుందో ఈ లింక్స్ ఓపెన్ చేసి చదవండి.
http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Chiranjeevi-loses-not-just-elections-but-respect-too/articleshow/4544803.cmshttp://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Former-aide-lashes-out-at-Chiru/articleshow/4544263.cms
ఇకఇక మన తప్పిదాలు విషయానికి వస్తే, అంతగా ప్రభావం చూపకున్నా, అప్పటికి వేరే దారి లేకున్నా, తెలుగు వాడి ఆత్మగౌరవం నినాదంతో పుట్టి, తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పార్టీ, తన ఉనికి కోసం తెలుగువాడినే విభజించాలి అనే నిర్ణయం తీసుకోవాల్సి రావడం ఒక వైఫల్యం అయితే, పదిహేను సంవత్సరాల పాలనలో మనవల్ల రాష్ట్రానికి జరిగిన మేలుని జనంలోకి సమర్ధంగా తీసుకువెల్లకుండా కాంగ్రెస్ అవినీతి గురించే ఎక్కువ మాట్లాడుతూ వాళ్లకి ఫ్రీగా పబ్లిసిటీ చేసిపెట్టాము.
ఏది ఏమైనా, పోరాడాం, లక్ష్యానికి అతిచేరువలో ఆగిపోయాం.. మనకి తెలియని ప్రతిపక్షము కాదు, మనము అనుభవించని అధికారము కాదు ఇవాళ భాధపడటానికి!! గెలిచామని రేచ్చిపోయేవాడు, ఒడామని ఏడ్చేవాడు ఇద్దరూ మరొక పోటీకి నైతికంగా అనర్హులే. గెలుపోటములు ఎలా ఉన్నా రేయింభావాళ్ళు శ్రమించిన చంద్రబాబు గారిని, పార్టీ కోసం ఏమీ ఆశించకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి జెండాను మోసిన కార్యకర్తలను, రాజకీయాలకు దూరం అంటూ ఇంట్లోనుండి ఎప్పుడూ బయటకు రాని వారు కూడా భాద్యతగా ఫీల్ అయ్యి వచ్చి శ్రమించిన గ్రామస్థాయి పెద్దలను, ఉడతా భక్తిగా తమవంతు సాయం అందించిన 'మనకోసం-తెలుగుదేశం' విభాగాన్ని మనమంతా అభినందించి తీరాల్సిందే!!.
Tuesday, July 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment