ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Friday, May 22, 2009

ఓ కార్యకర్త నివేదన

ఓ ప్రియమయిన తెలుగుదేశం కార్యకర్తా ......


అన్నగారి ఆశయాల సాధనకు చంద్రన్న సారధ్యంలో ,తెలుగుదేశం పార్టీ కోసం రాత్రింబవళ్ళు పోరాడినందుకు ముందుగా అభినందనలు .........

ఓటమిని , గెలుపును ఒకేలా తీసుకునే నీ ఓర్పుకి .. పార్టీ గెలుపు కోసం ప్రజా సమస్యల మీద మళ్ళీ యుద్దానికి సన్నద్ధం అవుతున్న నీ మనోధైర్యానికి జోహార్లు.............


నీ లాంటి క్రమశిక్షణ కలిగిన, సైనికుడి లాంటి కార్యకర్త వుండటం తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టం .......అందుకేనేమో పార్టీ కుడా, "త్యాగాలకు వెనుతియ్యని దేశభక్తులారా" అంటూ నీ విలువను దేశభక్తులతో పోల్చి తన గీతంలో నీకు అగ్ర పీఠం వేసింది ......

రాజకీయాలలో కార్యకర్త అనేది చాలా విలువయిన ,ముఖ్యమయిన దశ.... ఈ దశలో ప్రజా సమస్యల మీద , సామజిక అంశాల మీద (సామాజికం అంటే కులం అనే భ్రమ వద్దు) ,రాజకీయ ఆర్ధిక అంశాల మీద అవగాహన పెంచుకోవటానికి ....పార్టీ యొక్క సిద్దాంతాలను , లక్ష్యాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళటానికి ...ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీని నడపటానికి , పార్టీ నాయకత్వానికి, అవసరమయ్యే సూచనలు చెయ్యటానికి దొరికే ఒక చక్కని క్రియాశీల పాత్ర ....... క్రమశిక్షణతో ,దీక్షతో కార్యకర్త అనే మొదటి మెట్టు జాగర్తగా ఎక్కి అందులో రాటుదేలినవాడే రాజకీయాలలో మిగతా మెట్లు అధిరోహించగలడు......అలాంటి వాడే దీర్ఘకాలం ప్రజలలో నిలవగలడు ...... ఆ కార్యకర్త పాత్ర విలువ తెలిసిన వాడే నాయకుడు...... ప్రజానాయకుడు . ఇవ్వాళా ఎంత మంది ఆ కార్యకర్త పాత్ర పోషించి, పార్టీకి సేవలు అందించి పరిపక్వతతో నాయకత్వాన్ని అందుకుంటున్నారు???? పదవులు పొందుతున్నారు??????


పార్టీ ఓడినా, గెలిచినా ఎక్కువగా స్పందించేది కార్యకర్తనే ....కార్యకర్తకి పార్టీ ప్రాణప్రదం ...అంతగా ప్రేమిస్తారు కాబట్టేనేమో, కొన్ని కొన్ని సార్లు ఓటమి బాదలు ఓర్చుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.... అలాంటి కార్యకర్తలను కాపాడుకోవటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే నాయకులు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు..... నేడు ఎంతమంది వున్నారు??? ..బహుశా వేళ్ళమీద లెక్కించ వచ్చు ......


చేతిలో నాలుగు రూపాయలు పెట్టుకుని వచ్చి పార్టీ సిద్ధాంతం తెలియకుండా, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా.... కార్యకర్త చేతిలో వున్న జెండా గుడ్డను కండువగా మెడలో వేసుకుని నాయకుడు అయిపోదామనుకునే వాడు చరిత్రలో నాయకుడిగా నిలిచిన సందర్భాలు చాలా అరుదు.........నేడు దురదృష్టం కొద్ది అలాంటి వారే ఎక్కువ అయిపోతున్నారు .......ఒక్కసారికే తెరమరుగవుతున్నారు ........

ఈ ఎన్నికలలో ఓటమికి ఎవరు భాద్యులు???.....ఏ ఏ అంశాలు ప్రభావితం చేసాయి???......ఆ తప్పులు మనం దిద్దుకోగలమా?? .....అవి మళ్ళీ పునరావృతం అవ్వకుండా మనం జాగర్త పడగలమా???.........

2004 లో ఓటమికి భాద్యతనంతా తన మీద వేసుకుని పార్టీ కోసం చాలా మారారు మన నాయకుడు...... ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజలతో ఎండకు ఎండి వానకు తడిసి 117 రోజులు ప్రజల జీవన ప్రమాణాలను అతి దగ్గరగా చూసిన అనుభవం ఆయనను మరింత మార్చింది......ఇంకా మారటానికి ప్రయత్నిస్తున్నారు ......మరి మిగతా నాయకుల్లో ఎంత మంది ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని వాళ్ళ పద్దతులు మార్చుకున్నారు......నిజంగా మార్చుకుని వుంటే పార్టీకి నేటి అపజయం వచ్చేదా????....... అందుకే నేను అంటాను , కాంగ్రెస్ గెలవలేదు ....ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలికతో పాటు కొంత మంది నాయకుల తీరు వల్ల తెలుగుదేశం పార్టీ ఓడింది, అని..... మీలో ఎందరు ఏకీభవిస్తారు???? ......అందరిని ఒకే గాటన కట్టటంలేదు ......చాలా మంది నాయకులు Team Work చేసారు... అందులో కొందరు గెలిచి మంచి ఫలితాన్ని పార్టీకి అందించారు .....కొందరు ఓడారు...అలా ఓడిన వాళ్ళు ధైర్యం కోల్పోకుండా కార్యకర్తలతో వుంటే రేపు అయినా విజయం తప్పక వరిస్తుంది.....అందుకు నిదర్శనంగా నేడు కొంత మంది మన కళ్ళ ముందే వున్నారు ...........

ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోలేని నాయకులు ....కార్యకర్తల అభిప్రాయనికి విలువ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని కార్యకర్తల మీద , పార్టీ మీద రుద్దిన నాయకులు..... ఈర్ష ద్వేషాలతో పక్కనోళ్లకి అవకాశాలు రాకూడదు , వాళ్ళు గెలవకూడదు ,నేనే నాయకుడిగా చలామణి అవ్వాలి ,నేనే అన్ని అనుభవించాలి అనే స్వార్ధ బుద్దితో కుటిల రాజకీయం నడిపిన నాయకులు .... తాము నష్ట పోవటమే కాకుండా పార్టీని నష్ట పరిచారు.....రాష్ట్ర ప్రజలను రాక్షస పాలన నుండి విముక్తి చేయుటంలో మన చంద్రన్న సారధ్యంలో కార్యకర్తలు చేసిన పోరాటానికి ప్రయోజనం లేకుండా చేసారు .... కొంత మంది సీనియర్లుగా చెప్పుకుని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న నాయకులను పక్కన పెట్టి పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించండి అని కార్యకర్తలు మొరపెట్టుకునే స్థితి వచ్చింది అంటే ,కార్యకర్తలు ఎంతటి ఆవేదనలో వున్నారో తెలుస్తుంది ....
నా వ్యక్తిగత అభిప్రాయలు / సూచనలు :

1. ప్రజల కోసం పార్టీ చేసే పోరాటాల్లో, ఆ ప్రజల భాగస్వామ్యం ఎంత వరకు వుంటుందో మనం ఆలోచించుకోవాలి ......ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీ కార్యకర్తలు ఎంత పోరాడినా ఫలితం ఆశాజనకంగా వుండదు......మన పోరాటం వారి కోసం చేస్తున్నామన్న నమ్మకాన్ని కలిగించాలి......


2.ఒక మండలంలో కానీ ,ఒక నియోజకవర్గంలో గాని పార్టీ కార్యక్రమం జరుగుతున్నా,పదవులు ఇస్తున్నా అక్కడ వుండే కార్యకర్తల అందరి అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నాము...కార్యకర్తలు అందరికి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నాము .......నాయకులు కార్యకర్తలందరిని ఎందుకు కలుపుకుని వెళ్ళలేక పోతున్నారు.....దీనిని మనం ఏ రోజు అయితే మార్చుకుంటామో ఆ రోజు ఆంద్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారుతుంది.

3.కొన్ని చోట్ల స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా బయట నుండి తెచ్చిన నాయకులను వారి మీద బలవంతంగా రుద్దటం వల్లన కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిని భారీ మూల్యాన్ని చెల్లించుకోవాలిసి వచ్చింది.. మునుముందు ఈ పద్ధతి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి.

4.పార్టీ అనుభంద విభాగాలు పార్టీ విజయానికి ఎంత వరకు కృషి చేసాయి?? ....వాటి వల్ల పార్టీ యొక్క బలం ఎమన్నా పెరిగిందా??.......పదవులు పొందటానికి చూపిన శ్రద్ధ పార్టీ విజయానికి ఎంత వరకు చూపారు??.......5. పార్టీలో వున్న అన్ని స్థాయిల నాయకులకు మానసిక పరమయిన Conselling ఇప్పించి, గ్రూపు రాజాకీయ సంస్కృతి నుంచి బయట పడేసి Team work విలువ చెప్పాలిసిన సమయం ఆసన్నమయినది..........

6.పార్టీని వీడి వెళ్ళిన వాళ్ళను ,కొత్తగా వచ్చేవాల్లను చేర్చుకునే విషయంలో స్థానిక కార్యకర్తలు, నాయకుల అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని వారి ఆమోదం వుంటేనే చేర్చుకుంటే మేలు జరుగుతుంది ....లేదంటే పార్టీ విశ్వసనీయత మరియు పార్టీని అంటిపెట్టుకుని వున్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం వుంది..

7.ఎలాంటి హంగు ఆర్భాటాలకు తావు లేకుండా వీలున్నప్పుడల్లా, కార్యకర్తల ఇళ్ళల్లో జరిగే శుభకార్యాలకు హాజరవ్వటం వల్ల లేదా వారికి వ్యక్తిగత శుభాకాంక్షలు పంపటం వల్ల ప్రజలలో చంద్రబాబు గారి Brand Value మరింత పెరుగుతుంది..కార్యకర్తలలో మరింత ఉత్సాహాన్ని, పోరాటపటిమను పెంచటానికి దోహద పడుతుంది....
8.పార్టీ తరుపున గెలిచిన నాయకులకు Assembly మరియు మీడియా సమావేశాలలో పార్టీ వాణిని వినిపించటానికి SOFT SKILLS మీద training ...వివిధ ప్రభుత్వ శాఖలలో జరిగే లొసుగులను బయటికి తీయుటకు ఆయా శాఖల మీద అవగాహన కల్పించేలా మరియు రోజు వారీ సాధారణ పరిపాలనలో జరిగే తప్పులని ఎత్తి చూపటానికి MLA,MPలకు మరియు పార్టీ నాయకులకు ఎప్పటి కప్పుడు శిక్షణ తరగతులు నిర్వహించవలిసిన ఆవశ్యకత చాలా వుంది......
9. గ్రామ స్తాయిలో వుండే కార్యకర్తల అందరి బయోడేటాను సేకరించి, పార్టీ తరుపున వారికి సూచనలు సలహాలు ఎప్పటి కప్పుడు నేరుగా అందించే ప్రయత్నం మరింత మెరుగ్గా జరగాలి....
10.ఈ ఎన్నికలలో గెలుపు ఓటముల పైన జరిగే నియోజక వర్గాల సమీక్షా సమావేశాలు NTR Trust Bhavanలో కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ,కార్యకర్తల అందరి నడుమ జరిగితే పార్టీ వాస్తవ పరిస్థితి అధినాయకుడికి తెలుస్తుంది....దానికి తగినట్లుగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకునేదానికి మంచి అవకాశం దొరుకుతుంది.....నిజమయినకార్యకర్తల మనోభావాలు పార్టీకి తెలుస్తాయి.....దీనికి కొంత సమయం తీసుకున్న గాని, ఒకసారి చేసి చుస్తే దాని వల్ల వచ్చే ఫలితం ఎంత మెరుగ్గా వుంటుందో తెలుస్తూంది.
మహానాడు నుంచి అయిన ,ఆ మహానుబావుడు చూపిన దారిలో మన నాయకులు అందరు ఐకమత్యంతో ముందుకు సాగుతారని...కార్యకర్తలను వెన్నంటి నడిపిస్తారని,కాంగ్రెస్ దాడుల నుంచి వారికి అండగా వుంటారని .... ఆ పెద్దాయన ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యల మీద, ప్రలోభాలకు లొంగకుండా రాజీ లేని పోరాటం చేస్తారని ....తెలుగుదేశం పార్టీని విజయ శిఖరాల వైపు నడిపిస్తారని ఆశిస్తూ .......
సగటు తెలుగుదేశం కార్యకర్త






No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?